Saturday, July 6, 2024
HomeదైవంPuri Jagannath Heritage Corridor: అందుబాటులోకి జగన్నాథ్ కారిడార్

Puri Jagannath Heritage Corridor: అందుబాటులోకి జగన్నాథ్ కారిడార్

ప్రారంభించిన సీఎం నవీన్ పట్నాయక్

శ్రీమందిర జగన్నాథ్ టెంపుల్ హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్టును ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్ జాతికి అంకితం చేశారు.  పూరి జగన్నాథ్ ఆలయం ప్రధాన ప్రహరీ గోడను ఆనుకుని 800 కోట్ల వ్యయంతో కారిడార్ ను నిర్మించారు.  జగన్నాథ్ మందిర ప్రదక్షిణతోపాటు ఆలయం చుట్టుపక్కల భక్తులు ఎక్కడి నుంచిైనా గుడిని చూసేలా, ధ్యానం చేసుకునేలా ఈ కారిడార్ ను విశాలంగా, సుందరంగా నిర్మించటం విశేషం. క్లాక్ రూములు, టాయ్ లెట్స్, ఇతర సదుపాయాలను భక్తులకు అనువుగా ఉండేలా నిర్మిస్తూ, రోడ్లను మరింత విశాలంగా విస్తరించారు.  ఫ్లై ఓవర్లతో పాటు గుడి ఆవరణను అత్యంత సుందరంగా నిర్మించటం విశేషం.

- Advertisement -

శ్రీ మందిరం చేరుకునేలా శ్రీ సేతు, శ్రీ మందిరం చుట్టూ శ్రీ డండా (రోడ్డు)ను వేసి, రాష్ట్రంలోని అన్ని జగన్నాథ మందిరాలను జీర్ణోద్ధరణ చేపట్టడాన్ని నవీన్ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. డిజిటల్ స్క్రీన్లతో స్పెషల్ ఆడిటోరియం, యాంపీ థియేటర్ వంటివన్నీ ఈ పరిక్రమ ప్రాజెక్టులో భాగం.  ఈరోజు రాష్ట్రంలో సెలవు దినంగా ప్రకటించి, పెద్దఎత్తున జగన్నాథ్ మందిర కారిడార్ ను ఆవిష్కరించటంతో జగన్నాథ భక్తుల్లో ఆనందం నెలకొంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News