Shravana Masam 2025 Dates: శ్రావణ మాసం.. హిందువులకు అత్యంత పవిత్రమైనది. ఇది పార్వతీపరమేశ్వరులకు ఎంతో ప్రీతికరమైన మాసం. పైగా వర్షాకాలంలో వస్తుంది. ప్రకృతి రమణీయతకు, ఆధ్యాత్మిక వాతావరణానికి అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మహాదేవుడిని ఆరాధించడం వల్ల మీరు కోరుకున్న కోర్కెలు నెరవేరుతాయి. వ్రతాలు, నోములు ఆధారంగా కూడా ఈ నెల ఎంతో ప్రత్యేకమైనది. ఈ మాసంలోనే నిండు సౌభాగ్యం కోసం మహిళలు వరలక్ష్మీదేవి వ్రతం ఆచరిస్తారు. కొత్త పనులు ప్రారంభించడానికి, వివాహాది శుభకార్యాలకు, గృహ ప్రవేశాలకు, నామకరణాలకు అుకూలంగా ఉంటుంది.
జూలై 11 లేదా 25?
అయితే శ్రావణ మాసం తేదీల్లోనే కొంత చిక్కు ఉంది. హిందీ క్యాలెండర్ ప్రకారం, ఈ ఏడాది శ్రావణ మాసం జూలై 11న ప్రారంభమై..ఆగస్టు 9న ముగుస్తుంది. మన సౌత్ ఇండియన్ క్యాలెండర్ ప్రకారం, శ్రావణం జూలై 25న మెుదలై.. ఆగస్టు 23న ముగుస్తుంది. దక్షిణ భారత పంచాంగం ప్రకారం శ్రావణ మాస తొలి సోమవారం జూలై 28న వస్తుంది. ఇదే నెలలోనే జూలై 29న నాగపంచమి, ఆగస్టు 8న వరలక్ష్మీదేవి వ్రతం, ఆగస్టు 9న రాఖీ పండుగ, ఆగస్టు 15న జన్మాష్టమి జరుపుకోనున్నారు.
మంగళ గౌరీ వ్రతం ఎప్పుడు?
హిందూ క్యాలెండర్ ప్రకారం, శ్రావణ మాసం ఐదో నెల. ప్రతి సోమవారం శివారాధన చేయడం వల్ల మీరు అనుకున్నది సిద్ధిస్తుంది. పైగా ఇది శ్రీమహావిష్ణువు జన్మనక్షత్రం కావడం విశేషం. ఈ పవిత్రమైన మాసంలో పూజలు చేయడం వల్ల మీకు శివకేశవుల ఆశీస్సుల లభిస్తాయన్న మాట. శ్రావణ శుక్రవారం నాడు మహిళలు మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం(ఆగస్టు 8) నాడు ఈ వ్రతాన్ని జరుపుకుంటారు. ఈ శుభదినాన లక్ష్మీదేవిని పూజించడం వల్ల అష్టలక్ష్ములను పూజించినంత పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. ఈ వ్రతం చేయడం వల్ల మీ కుటుంబంలో సుఖసంతోషాలు, అష్టఐశ్వర్యాలు లభిస్తాయి.
Disclaimer: పైన తెలియజేసిన కథనం ఇంటర్నెట్ సమాచారం, పండితుల సూచనలు, శాస్తాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా రూపొందించడమైనది. దీనికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. దీనిని తెలుగు ప్రభ ధృవీకరించలేదు.


