Tuesday, September 17, 2024
HomeదైవంSrisailam: భ్రమరాంబాదేవికి కుంభోత్సవం

Srisailam: భ్రమరాంబాదేవికి కుంభోత్సవం

శ్రీశైలం మహా క్షేత్రంలో చైత్రమాసంలో పౌర్ణమి తరువాత వచ్చే మంగళ లేదా శుక్రవారం రోజున (ఏ రోజుముందుగా వస్తే ఆ రోజు) శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి కుంభోత్సవం జరపడం సంప్రదాయం. ఈ సంవత్సరం. ఏప్రిల్ 11 న ఈ కుంభోత్సవం నిర్వహించనున్నారు.
అమ్మవారికి సాత్విక బలి నిర్వహించేందుకు ( కొబ్బరికాయలు, గుమ్మడికాయలు, నిమ్మకాయలు, మొదలగునవి సమర్పించడం) ఈ కుంభోత్సవం జరిపించడం ఆనవాయితి. కుంభోత్సవం రోజున స్త్రీ వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభహారతి సమర్పించడం ప్రధాన ఘట్టం. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసిన వెంటనే ప్రతి మంగళవారం, శుక్రవారం రోజులలో అమ్మవారికి కొబ్బరికాయలను సమర్పిస్తారు. ఇందులో భాగంగా మంగళవారం అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ముందుగా అమ్మవారి ఆలయ ప్రదక్షిణ మండపంలో కొబ్బరికాయలను రాశిగా పోసి పసుపు, కుంకుమలతో వాటికి పూజాదికాలు జరిపించారు. తరువాత అమ్మవారికి ఈ కొబ్బరికాయలు సమర్పించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News