Surya nakshatra transit in August 2025: వైదిక జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల రాజుగా పిలువబడే సూర్యుడు ఒక్కొక్క నెల ఒక్కో రాశిలో సంచరిస్తాడు. సంవత్సరం మెుత్తం మీద 12 రాశుల్లో ప్రయాణిస్తాడు. సూర్యుడి యెుక్క రాశి మార్పునే సంక్రాంతి అంటారు. అంతేకాకుండా కాలానుగుణంగా తన నక్షత్రాలను కూడా మారుస్తాడు. ప్రస్తుతం ఆశ్లష నక్షత్రంలో ఉన్న ఆదిత్యుడు ఈ నెల 17న మఖ నక్షత్ర ప్రవేశం చేయనున్నాడు. పైగా ఈ నక్షత్రానికి కేతువు అధిపతి. ఆగస్టు 29 వరకు భాస్కరుడు అక్కడే ఉంటాడు. కేతు నక్షత్రంలో సూర్యుడి సంచారం కొందరిని ధనవంతులు చేయనుంది. ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.
మేష రాశి
సూర్యుని నక్షత్ర సంచారం మేషరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. వీరు ఏ పని చేపట్టిన అందులో సత్ఫలితాలను పొందుతారు. ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉంటారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ కంప్లీట్ అవుతాయి. వైవాహిక జీవితం సాఫీగా సాగుతోంది. ఆస్తిపాస్తులు పెరుగుతాయి. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ రానే వస్తుంది. మీ కీర్తి నలుదిక్కులకు వ్యాపిస్తుంది.
వృశ్చిక రాశి
భాస్కరుడు నక్షత్ర సంచారం వృశ్చిక రాశివారికి ఎనలేని కీర్తిని తెచ్చిపెడుతుంది. వ్యాపారస్తులు భారీగా లాభపడతారు. విదేశాల్లో చదువుకోవాలన్న విద్యార్థులు కోరిక నెరవేరుతుంది. కెరీర్ లో మంచి అవకాశాలు వస్తాయి. మీకు అదృష్టం కలిసి వచ్చి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆఫీసులో మీ బాస్ చేత ప్రశంసలు అందుకుంటారు. వైవాహిక, వ్యక్తిగత జీవితం బాగుంటుంది. పెళ్లికాని వారికి వివాహ యోగం ఉంది.
Also Read: Raksha Bandhan 2025- రాఖీ పౌర్ణమి నుండి ఈ 5 రాశుల సుడి తిరగబోతుంది.. ఇందులో మీది ఉందా?
తులారాశి
తులరాశి వారికి ఆదిత్యుడు సంచారం అద్భుతంగా ఉండబోతుంది. అదృష్టం ఎల్లప్పుడూ మీ వెన్నంటే ఉంటుంది. ఇతరులతో సత్సంబంధాలు ఉంటాయి. అనేక మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది. డబ్బును భారీగా పొదుపు చేస్తారు. లైఫ్ పార్టనర్ తో మంచి రొమాంటిక్ సమయం గడుపుతారు. వ్యాపారంలో లాభాలు ఉండటంతో..దానిని విస్తరిస్తారు. వృత్తి, ఉద్యోగాలు మీకు కలిసి వస్తాయి.
Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన కథనం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పండితులు సూచనలు, ఇంటర్నెట్ సమాచారం ఆధారంగా పై కథనాన్ని రూపొందించడమైనది. దీనిని తెలుగు ప్రభ ధృవీకరించలేదు.


