Friday, September 20, 2024
HomeదైవంTirumala-Tirupathi: నడక దారిలో తగ్గుతున్న భక్తులు

Tirumala-Tirupathi: నడక దారిలో తగ్గుతున్న భక్తులు

నడక దారి భక్తుల్లో అయోమయం

తిరుమలలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు అలిపిరి, శ్రీనివాస మంగాపురం వైపులనుంచి నడక దారిలో వెళ్లే భక్తుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. నడక దారిలోపులుల సంచారాన్ని నిరోధించడానికి అధికారులు శతవిధాలుగాప్రయత్నిస్తున్నప్పటికీ, నడక దారిలో తిరుమల చేరుకోవడానికి భక్తులుభయపడుతున్నట్టు కనిపిస్తోంది. తిరుమల ఘాట్ రోడ్డు మీద పులుల సంచారానికిశాశ్వతంగా అడ్డుకట్ట వేయడానికి భద్రతాధికారులు, నిఘా అధికారులు చేస్తున్నప్రయత్నాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గత జూన్ 22న తల్లితండ్రులతోఅలిపిరి వైపు నుంచి నడక దారిలో శ్రీవారి దర్శనానికి వెడుతున్న ఆరేళ్లబాలుడిపై పులి దాడి చేసిన తర్వాత నుంచి ఇంతవరకూ అధికారులు ఆరు పులులనుపట్టుకోవడం జరిగింది.వార్షిక బ్రహోత్సవాలు ప్రారంభమైన మొదటి రోజునే నడక దారిలో పులిపట్టుబట్టడంతో భక్తులతో మరింతగా భయాందోళనలు పెరిగాయి. గత ఏడాది ఇదేసమయంతో పోల్చితే ప్రస్తుతం నడక దారిలో వెళ్లే భక్తులు, యాత్రికుల సంఖ్యసగానికి సగం తగ్గిపోయిందని అధికారులు తెలియ జేశారు. అంతేకాక, తిరుపతిలోనేదివ్య దర్శన టికెట్లను జారీ చేయడం జరుగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానంఅధికారులు ప్రకటించడంతో భక్తుల్లో ఎక్కువ మంది నడక దారిలో తిరుమలకువెళ్లడాన్ని తగ్గించేశారు. వారు ఇక ఉచిత దర్శనానికి నడక దారిలోవెళ్లాల్సిన అవసరం ఉండదు.తిరుమల తిరుపతి దేవస్థానం (టి.టి.డి)లోని భద్రత, నిఘా విభాగానికి చెందినఅధికారులు అందజేసిన వివరాల ప్రకారం, సెప్టెంబర్ 18న నడక దారిలో వచ్చినభక్తుల సంఖ్య 9,000 కాగా, సెప్టెంబర్ 19న ఈ దారిలో వచ్చిన భక్తుల సంఖ్య8,500లకు తగ్గిపోయింది. ఇక 20, 21 తేదీల్లో ఈ సంఖ్య 6,000లకు చేరుకుంది.గరుడ వాహన సేవ రోజున ఈ సంఖ్య మరీ దారుణంగా తగ్గిపోయిందని అధికారులుచెప్పారు. గత ఏడాది సెప్టెంబర్ 18, 19 తేదీలలో నడక దారిలో వచ్చిన భక్తులసంఖ్య 32,000 పైచిలుకే. గత ఆగస్టు 12న పులి దాడిలో లక్షిత అనే బాలికప్రాణాలు కోల్పోయిన దగ్గర నుంచి భక్తులు నడక దారిలో వెళ్లడానికిజంకుతున్నారు.అధికారులు ఈ నడక దారిలో వెళ్లే భక్తులకు కర్రలు ఇవ్వడం మొదలు పెట్టారుకానీ, కొందరు భక్తులకు కర్రలు అందకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తమ భద్రత సంగతి తామే చూసుకుంటున్నామని కూడా కొందరు భక్తులుతెలిపారు. నడక దారిలో వెళ్లే విషయంలో అధికారులు భక్తులకు లేనిపోనినిబంధనలు, ఆంక్షలు విధిస్తున్నారని, నడక దారిలో వెళ్లకుండానిరోధిస్తున్నారని భక్తులు ఫిర్యాదులు చేస్తున్నారు. తాము భక్తులనునియంత్రిస్తున్న మాట నిజమేనని, అయితే, నిఘా అధికారులు వీరికి సహాయంఅందిస్తున్నారే తప్ప ఇబ్బంది పెట్టడం లేదని భద్రతా అధికారులు వివరించారు.‘‘భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం’’ అని టి.టి.డి చైర్మన్బి. కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News