Budh Mangal yuti 2025: గ్రహాల కాలానుగుణం రాశులను మార్చడం, ఇతర గ్రహాలతో సంయోగం చెంది శుభ, అశుభకరమైన యోగాలను ఏర్పరచడం చేస్తూ ఉంటాయి. ఇవాళ గ్రహాల సైన్యాధిపతి అయిన కుజుడు తులా రాశి నుంచి తన సొంత రాశి అయిన వృశ్చిక రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇదే సమయంలో బుధుడు కూడా అదే రాశిలో సంచరించబోతున్నాడు. వీరిద్దరి కలయిక అక్టోబర్ 27 నుండి నవంబర్ 23 వరకు ఉంటుంది. బుధ-కుజ గ్రహాల సంయోగం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం.
వృషభరాశి
కుజుడు-బుధుడు సంయోగం వృషభరాశి వారి ఫేట్ ను మార్చబోతుంది. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. ఆర్థికంగా లాభపడతారు. మీ సంసార జీవితంలో ఆనందం, ఐశ్వర్యం వెల్లివిరుస్తుంది. ఆకస్మికంగా ఉద్యోగ ఆఫర్ వస్తుంది. మీ చింతలన్నీ తొలగిపోతాయి. పని లేని వారికి ఉపాధి దొరుకుతుంది. మీ లవ్ సక్సెస్ అవ్వడంతోపాటు అది పెళ్లికి దారి తీస్తుంది. కెరీర్ లో అనుకోని పురోగతి ఉంటుంది. అప్పుల ఊబి నుండి బయటపడే అవకాశం ఉంది.
ధనస్సు రాశి
ధనస్సు రాశి వారికి బుధ, కుజుల కలయిక ప్రయోజనకరంగా ఉండబోతుంది. మీ కెరీర్ లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. కుటుంబంలో ఆనందంతోపాటు ఐశ్వర్యం ఉంటుంది. మీరు అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. అదృష్టం ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం దొరుకుతుంది. లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీ కెరీర్ దూసుకుపోతుంది. మీరు త్వరలో ధనవంతులు అయ్యే అవకాశం కనిపిస్తుంది.
Also Read:Festivals in November 2025 – నవంబరులో రాబోయే పండుగలు, వ్రతాలు ఏంటో తెలుసా?
మిథునరాశి
వృశ్చిక రాశిలో కుజుడు మరియు బుధుడు కలయిక మిథున రాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. మీరు ఆర్థికంగా మంచి పొజిషన్ లో ఉంటారు. ఉద్యోగస్థులకు జీతం పెరగడంతోపాటు ప్రమోషన్ కు కూడా అవకాశం ఉంది. ఆదాయం విపరీతంగా వృద్ధి చెందుతుంది. వ్యాపారుల ఊహించని లాభాలను చూస్తారు. మీకు ప్రతి పనిలో మీ ఫ్యామిలీ సపోర్టు అయితే ఉంటుంది. ఇతరులతో పరిచయాలు పెరుగుతాయి. కెరీర్ పీక్స్ లో ఉంటుంది. మీ వ్యక్తిత్వంతో నలుగురినీ ఆకట్టుకుంటారు.


