Sunday, November 16, 2025
HomeదైవంVinayaka Chavithi:2025లో వినాయక చవితి ఎప్పుడు? విగ్రహ ప్రతిష్ఠ ఏ సమయంలో చేయాలి?

Vinayaka Chavithi:2025లో వినాయక చవితి ఎప్పుడు? విగ్రహ ప్రతిష్ఠ ఏ సమయంలో చేయాలి?

Ganesh Chaturthi 2025 Date and Time: ఈరోజు నుంచి శ్రావణం మాసం మెుదలైంది.ఇది ఆగస్టు 23 వరకు ఉండనుంది. ఈ మాసంలో వరలక్ష్మీ వ్రతం, రాఖీ పౌర్ణమి వంటి పండుగలు జరుపుకోబోతున్నారు. ఈ శ్రావణం మాసం ముగియగానే వచ్చే భాద్రపద మాసంలో వినాయక చవితి వస్తుంది. ఈ ఫెస్టివల్ ను ప్రపంచ నలుమూలల ఉన్న హిందువులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. మెుత్తం పది రోజులపాటు ఈ వేడుకను చేసుకుంటారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో చాలా వైభవంగా జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది గణేష్ చతుర్థి ఎప్పుడు వచ్చింది, విగ్రహ స్థాపనకు శుభముహూర్తం ఎప్పుడో తెలుసుకుందాం.

- Advertisement -

వినాయక చవితి తేదీ, శుభ ముహూర్తం
చతుర్థి తిథి ఆగస్టు 26, 2025 మధ్యాహ్నం 01:54 గంటలకు ప్రారంభమై.. ఆగస్టు 27, 2025 మధ్యాహ్నం 03:44 గంటలకు ముగుస్తుంది. అయితే ఉదయం తిథి ఆధారం చేసుకుని..ఈ సంవత్సరం వినాయక చవితి ఆగస్టు 27, 2025న జరుపుకుంటారు. ఈరోజున వినాయకుడి విగ్రహ పత్రిష్టాపనకు ఉదయం 11:06 గంటల నుంచి మధ్యాహ్నం 01:40 గంటల వరకు శుభసమయంగా చెబుతున్నారు. ఈ పండుగనాడు రసాయనాలు కలిపిన విగ్రహాలను కాకుండా మట్టి వినాయకుడిని ప్రతిష్టించడం ఎంతో శ్రేయస్కరం.

విగ్రహాన్ని ఏ దిశలో ఉంచాలి?
గణేశుడి విగ్రహాన్ని ఉత్తరం లేదా ఈశాన్యంలో ప్రతిష్టించడం శుభప్రదంగా భావిస్తారు. ముందుగా పీఠం లేదా చెక్కపలకను ఏర్పాటు చేసి దానిపై ఎరుపు రంగు వస్త్రాన్ని పరచాలి. విగ్రహా ప్రతిష్టకు ముందు పూజ జరపాలి. శుభ ముహూర్తం చూసుకుని విగ్రహ ప్రతిష్ఠ చేయాలి.

Also Read: Varalakshmi Vratam- వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు? దీనిని ఎలా జరుపుకోవాలి?

పూజా విధానం
విగ్రహాన్ని పెట్టిన తర్వాత తొలుత దీపారాధన చేయాలి. వినాయకుడిని చక్కగా అలంకరించాలి. పదహారుఉపచారాలతో షోడశోపచార పూజ చేయాలి.పూలు,పండ్లుతోపాటు గణపతికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్లును నైవేద్యంగా పెట్టాలి. ఈరోజున వినాయకుడిని 21 పత్రాలతో పూజిస్తారు. వినాయకుడి ముందు అష్టోతర శతనామావళి పఠించాలి.చివరగా కర్పూర హారతి ఇచ్చిపూజను ముగించాలి. ఈరోజున చంద్రుడిని చూడటం నిషిద్ధం. ఒక వేళ చూసినట్లయితే శ్యమంతకోపాఖ్యానం వినడం వల్ల దోష నివారణ అవుతుంది. వినాయక వ్రతం గురించి స్కంద,భవిష్య పురాణాల్లో ప్రస్తావించబడింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad