Shubha yogas in Kamika Ekadeshi: ప్రతి నెలలో రెండు ఏకాదశులు ఉంటాయి. ఈ పవిత్రమైన రోజున ఉపవాసాన్ని ఆచరించి.. శ్రీమహావిష్ణువును ఆరాధించడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ రోజున శివుడ్ని ఆరాధించడం లేదా లింగాభిషేకం చేయడం వల్ల కూడా శుభఫలితాలను పొందుతారు. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని కామిక ఏకాదశి అంటారు. ఈ శుభకరమైన ఈ సంవత్సరం జూలై 21న రాబోతుంది. దీని ప్రభావం మెత్తం 12 రాశిచక్ర గుర్తులపై ఉంటుంది. ఈసారి కామిక ఏకాదశికి ఒక స్పెషల్ ఉంది. ఎందుకంటే ఈ శుభ దినాన కొన్ని అద్భుతమైన యోగాలు ఏర్పడబోతున్నాయి. దీంతో కొందరు లాభపడనున్నారు. ఆ యోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సర్వార్థ సిద్ధి యోగం
ఈ యోగ ప్రభావం చేత మీ కోరికలన్నీ సకాలంలో నెరవేరుతాయి. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. మీ కెరీర్ లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీరు ఏ కార్యం చేపట్టినా అందులో సఫలత పొందుతారు. దాంపత్య జీవితం కళకళ్లాడుతుంది. తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉంటారు. మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. కృషికి తగిన ప్రశంసలు లభిస్తాయి.
వృద్ధి యోగం
ఈ పవిత్రమైన యోగం వల్ల మీ కెరీర్ లో అద్భుతమైన పురోగతి ఉంటుంది. ఇది శుభకార్యాలకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఈ యోగం మీకు ప్రతి పనిలో విజయాన్ని అందిస్తుంది. సంపద వృద్ధి చెందుతుంది. మీ కీర్తి పెరుగుతుంది. కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. వైవాహిక జీవితంలో ఉన్న కలతలన్నీ తొలగిపోతాయి.
అమృత సిద్ధి యోగం
అమృత సిద్ధి యోగం వల్ల మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యంతోజీవిస్తారు. మీ జీవితంలో నెగిటివిటీ పోయి పాజిటివిటీ వస్తుంది. మీ కష్టాలన్నీ కడతేరుతాయి. అప్పుల భారం నుండి బయటపడతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు బాగుంటాయి. కెరీర్ లో అద్భుతమైన పురోగతి ఉంటుంది. పెళ్లికాని వారికి వివాహ యోగం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ ఆఫర్స్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. తెలుగు ప్రభ దీన్ని ధృవీకరించలేదు.


