Karthika Masam Last Monday significance: ప్రస్తుతం కార్తీక మాసం నడుస్తోంది. ఈ అత్యంత పవిత్రమైన మాసం నవంబర్ 20న అమావాస్యతో ముగియబోతుంది. ఈ క్రమంలో నవంబర్ 17వ తేదీన భక్తులు చివరి కార్తీక సోమవారం జరుపుకోనున్నారు. ఇప్పటి వరకు ఎవరైతే కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమిని ఆచరించలేదు వారు ఆఖరి సోమవారం రోజు ఉపవాసం ఉండి పూజలు చేస్తే మంచి ఫలితాలను పొందుతారట.
కార్తీక మాసంలో వచ్చే చివరి కార్తీక సోమవారానికి మిగతా రోజులకు లేని ప్రత్యేకత ఉంది. ఈరోజున ఉపవాసం ఉండి శివారాధన చేస్తే కోటీ సోమవారాలు చేసినంత పుణ్యం కలుగుతుందని పండితులు అంటున్నారు. దీంతో మీ జీవితంలో సుఖ సంతోషాలు, అష్టఐశ్వర్యాలు సిద్దిస్తాయి. కార్తీక సోమవారం నాడు ఎలా పూజ చేయాలో తెలుసుకుందాం.
పూజా ఇలా చేయండి?
ఈ పవిత్రమైన రోజున తెల్లవారుజామునే నిద్ర లేచి నదీ లేదా సముద్ర స్నానం ఆచరించాలి. అలా వీలుకాకపోతే ఇంటి దగ్గరే శుభమైన నీటితో తలస్నానం చేయండి. తర్వాత ఉతికిన లేదా కొత్త బట్టలు ధరించండి. ఇంట్లో పూజా గదిని శుభ్రం చేసి బోలా శంకరుడి చిత్ర పటాన్ని పెట్టి ఆ దేవుడు ముందు నెయ్యితో దీపారాధన చేయండి. స్వామివారికి పూలు, పండ్లు, స్వీట్లు నైవేద్యంగా సమర్పించండి. మహాదేవుడికి బిల్వార్చన, అభిషేకం చేయడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. మీకు దగ్గర శివాలయం ఉంటే అక్కడికి వెళ్లి పూజలు చేయడం ఉత్తమం.
Also Read: Karthika Amavasya 2025 – కార్తీక మాసం ఈ ఒక్కరోజు ఇలా చేశారంటే!
సాధారణంగా శివుడిని ప్రదోష కాలంలో పూజిస్తారు. పైగా ఇది సోమవారం వస్తుంది కాబట్టి భక్తులు సోమ ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తారు.ఈరోజున 365 వత్తులతో దీపారాధన చేయడం వల్ల మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. సంసార జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలిగిపోతాయి. పిల్లలు లేని దంపతులకు సంతానం కలుగుతుంది. అనారోగ్యం నుండి బయటపడతారు. మీరు నిండు నూరేళ్లు సౌభాగ్యంతో ఉంటారు. శివుడిని భక్తితో పూజించడం వల్ల మీకు డబ్బుకు లోటు ఉండదు.


