Sunday, July 7, 2024
Homeఓపన్ పేజ్Caste politics: కుల రాజకీయాలు మొదలు

Caste politics: కుల రాజకీయాలు మొదలు

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కుల రాజకీయాలు పేట్రేగిపోతుంటాయి. ఈ ఏడాది 9 రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు, వచ్చే ఏడాది లోక్‌సభకు ఎన్నికలు జరుగబోతున్న నేపథ్యంలో దేశంలో కుల రాజ కీయాలు ఊపందుకుంటున్నాయి. రాష్ట్రంలో కులపరమైన సర్వే జరగాలంటూ బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ డిమాండ్‌ చేయడంతో కుల ప్రస్తావనలు, కుల వివాదాలు మళ్లీ చెలరీగిపోయాయి. ఆయన ఈ మాట అనడమే కాదు, సర్వేకు శ్రీకారం కూడా చుట్టేశారు. సర్వేకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ కూడా ఇచ్చేసింది. బీహార్‌లో కుల ప్రస్తావన లేనిదే రాజకీయాలే లేవు. కాగా, వెనుకబడిన తరగతులలో క్రీమీ లేయర్‌ను గుర్తించే ఉద్దేశంతో కేంద్రం కూడా వివిధ కులాల ఆర్థిక, సామాజిక పరిస్థితులపై సర్వే ప్రారంభించింది. ఇది ఓబీసీలలో ఉప వర్గీకరణకు రూడా తమకు ఉపయోగపడుతుందని కేంద్రం భావిస్తున్నట్టు కనిపిస్తోంది. కులపరమైన గణాంకాలు, అంచనాల విషయంలో ప్రతిపక్షాలు లబ్ది పొందకుండా తామే అంతో ఇంతో ప్రయోజనం పొందాలని బీజేపీ గట్టి పట్టుదలతో ఉంది.

వాస్తవానికి, వివిధ కులాలు సరిసమానంగా రిజర్వేషన్‌ సౌకర్యాలు పొందుతున్నదీ లేనిదీ తెలుసుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2017లోనే ఒక కమిషన్‌ను ఏర్పాటు చేశారు. రిజర్వేషన్‌ ప్రయోజనాలను అనుభవిస్తున్న ఓబీసీలందరినీ నాలుగు వర్గాలుగా విభజించాలని కమిషన్‌ సూచించింది. ఈ ఉపవర్గీకరణతో ఓబీసీలలో కొన్ని కులాలను తమ వైపునకు తిప్పుకోవచ్చని, 2024 ఎన్నికల్లో రాజకీయంగా లళభ్ళి పొందవచ్చని బీజేపీ భావిస్తున్నట్టు కనిపిస్తోంది. మన్మోహన్‌ సింగ్‌ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం కూడా ఇటువంటి రాజకీయ ప్రయోజనాలను ఆశించి 2011లో ఒక సర్వి కమిషన్‌ను ఏర్పాటు చేసింది కానీ, ఆ కమిషన్‌ ఇంకా తన సర్వేను పూర్తి చేయక ముందే ప్రభుత్వం దిగిపోవాల్సి వచ్చింది. నవ భారతానికి నాంది పలుకుతామంటూ 2014 ఎన్నికల్లో వివిధ పార్టీలు వాగ్దానాలు చేశాయి కానీ, కులపరమైన గుర్తింపులలో మరింతగా చిక్కుకుపోవడం తప్ప ఏ రాజకీయ పార్టీ రూడా బయటికి వస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. అవే ఇప్పుడు కూడా ఎన్నికల రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయి. ఇక కుల సంబంధమైన రాజకీయాల విషయంలో ప్రతిపక్షాలు ఒక అకు ఎక్కువగానే చదివినట్టు కనిపిస్తోంది. వాటి ఎన్నికల వ్యూహమంతా కులాలనే కేంద్ర బిందువుగా చేసుకుంటోంది. దేశ వ్యాప్తంగా కుల గణన జరగాలని అవి పట్టుబడుతున్నాయి.

- Advertisement -

చివరిసారిగా కులాల అధారంగా 1931లో జనాభా లెక్కలు సేకరించడం జరిగింది. మండల్‌ కమిషన్‌ ఈ జనాభా లెక్కల ఆధారంగానే వెనుకబడిన తరగతులకు 27 శాతం రిజర్వేషన్లు సాధించింది. సాధారణంగా పదేళ్లకొకసారి జనాభా లెక్కల సేకరణ జరుగుతుంది. ఈ జనాభా లెక్కల సేకరణలో “షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలకు సంబంధించి ఏ విధంగా గణాంకాలను సేకరిస్తారో అదే విధంగా వెనుకబడిన వారిలోని కులాల గణాంకాలను కూడా సేకరించాలని దేశవ్యాప్తంగా ఓబీసీ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ డిమాండ్‌ను బీజేపీ ప్రభుత్వం ఇంతవరకూ ఆమోదించలేదు. 2011లో జరిగిన సామాజిక, అర్థిక సర్వే నివేదికను కూడా ఇది ఇంతవరకూ బయటపెట్టలేదు. కులాల సమాచారాన్ని సేకరించడంలో కొన్ని లోపాలు చోటు చేసుకున్నాయంటూ అది దీన్ని తొక్కి పెట్టి ఉంచింది.
బీహార్‌లో నితీశ్‌ కుమార్‌ ప్రభుత్వం చొరవ తీసుకుని కుల గణన ప్రారంభించింది. బీజేపీని ఇరకాట౦లో పెట్టడమే, అత్మరక్షణలో పడేయడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. అయితే, ప్రతిపక్షాలు మాత్రం ఇందుకు మోకాలడ్డుతున్నాయి. తాజాగా కుల పరమైన సమాచార సేకరణ జరగాలని, ఓబీసీ కోటాను కూడా మళ్లీ నిర్ధారించాలని అవి డిమాండ్‌ చేయడం మొదలుపెట్టాయి. ఇటువంటి డిమాండ్ల వల్ల, పోటాపోటీ సర్వీల వల్ల వెనుకబడిన తరగతుల నుంచి ఎవరు లబ్భి పొందుతారో తెలియదు కానీ, దేశవ్యాప్తంగా ఈ కుల జాడ్యం మళ్లీ రాజుకుంటోంది. బహుశా ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఇది కొనసాగే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News