Tuesday, May 21, 2024
Homeఫీచర్స్Karnataka: కర్ణాటకలో మెరిసిన మహిళా'మణులు'

Karnataka: కర్ణాటకలో మెరిసిన మహిళా’మణులు’

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి మహిళలు తమ సత్తా చాటారు. పది మంది మహిళలు శాసనసభ్యులుగా ఘన విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మంత్రిని సైతం ఓడించారు ఓ మహిళా నేత. అవకాశలభిస్తే మహిళలు ఉద్యోగాలు .. వ్యాపారాలతో పాటు రాజకీయాల్లోనూ రాణిస్తారని వారు మరోసారి రుజువు చేశారు. కన్నడ సీమ రాజకీయాల్లో మెరిసిన ఆ మహిళామణుల గురించి తెలుసుకుందాం.

- Advertisement -

మహిళలు అన్ని రంగాల్లోనూ తమ సత్తా చాటుతున్నారు. లోకల్, స్టేట్, నేషనల్ లెవల్స్ దాటి ఇంటర్నేషనల్‌ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు స్థాధిస్తున్నారు. రాజకీయాల్లో రాణిస్తున్న మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అసెంబ్లీకి పోటీ చేస్తున్న మహిళల సంఖ్య, గెలుస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే, జాతీయపార్టీలు, ప్రాంతీయ పార్టీలు మహిళలకు వారి జనాభాకు తగినట్లుగా టికెట్లను కేటాయించడం లేదు. దీంతో, అసెంబ్లీకి, పార్లమెంటుకు పోటీ చేస్తున్న మహిళల సంఖ్య పురుషులతో పోలిస్తే తక్కువగా ఉంటోంది. అయితే, కొంతమంది మహిళలు పార్టీలకు సవాల్ విసురుతూ… స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలోకి దిగుతున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పోటీ పడి జయకేతనం ఎగురవేస్తున్నారు. కర్ణాటక ఎన్నికల్లో ఒక మహిళా స్వతంత్ర అభ్యర్థి ఏకంగా రాష్ట్ర మంత్రి పైనే విజయం సాధించి సంచలనం సృష్టించారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తంగా 185 మంది మహిళలు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి నామినేషన్లు దాఖలు చేశారు. భారతీయ జనతా పార్టీ తరపున 12 మంది, కాంగ్రెస్ నుండి 11, జనతాదళ్ (సెక్యులర్‌ ) నుండి 13, ఆమ్‌ఆద్మీపార్టీ నుండి అత్యధికంగా 17 మంది మహిళలు నామినేషన్లు దాఖలు చేశారు. మిగిలిన వారు స్వతంత్ర అభ్యర్థులు. కర్ణాటక శాసనసభ ఏర్పడిన 1978 మొదలు ఇప్పటి వరకు 185 మంది మహిళలు అసెంబ్లీకి పోటీ చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ 185 మంది మహిళా అభ్యర్థుల్లో 10 మంది మహిళలు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. బీజేపీ నుండి ముగ్గురు, కాంగ్రెస్‌ నుండి నలుగురు, ఇద్దరు జేడీఎస్‌, స్వతంత్ర అభ్యర్థి ఒకరు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు.
జొల్లే శశికళ అన్నాసాహెబ్:
జొల్లే శశికళ అన్నాసాహెబ్ నిప్పాని నియోజకవర్గం నుండి గెలుపొందారు. బీజేపీ తరఫున పోటీ చేసిన జొల్లే శశికళ అన్నాసాహెబ్ 72,952 ఓట్లు సాధించి సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు. జొల్లే శశికళ గత ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా గెలిచారు. తన సిట్టింగ్ స్థానాన్ని ఆమె మరోసారి దక్కించుకున్నారు.

  1. మంజులా.ఎస్:
    మంజులా.ఎస్ మహదేవపురా నియోజకవర్గం నుండి పోటీ చేసి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన మంజులా.ఎస్.. లక్షా 61 వేలకు పైగా ఓట్లు సాధించి విజయం సాధించారు.
    భగీరథి మురుల్యా:
    భగీరథి మురుల్యా సులియా నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ మహిళా రైతు ఈ ఎన్నికల్లో 67 వేలకు పైగా ఓట్లు సాధించి ఎమ్మెల్యేగా గెలుపొందారు. బీజేపీ తరఫున పోటీ చేసి శాసనసభకు వెళ్లనున్నారు. రూప కళ ఎమ్
    కోలార్ గోల్డ్ ఫీల్డ్ నియోజవర్గం నుండి రూప కళ.ఎం పోటీ చేశారు. కాంగ్రెస్ తరఫున ఎన్నికల బరిలో నిలిచిన రూప కళ.. 81 వేలకు పైగా ఓట్లు సాధించి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి అయిన రూపకళ మరోసారి తన సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకున్నారు.
    కనీజ్ ఫాతిమా:
    ఉత్తర గుల్బార్గా స్థానం నుండి పోటీ చేసిన కనీజ్ ఫాతిమా ఘనవిజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన తన సమీప బీజేపీ ప్రత్యర్థిపై 80 వేలకు పైగా ఓట్లు సాధించి విజయం సాధించారు. ఫాతిమా కూడా సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకున్నారు.
    లతా మల్లిఖార్జున్
    లతా మల్లిఖార్జున్ హరపనపల్లి నియోజవర్గం నుండి గెలుపొందిన స్వతంత్ర్య అభ్యర్థిగా ఆమె రికార్డు నెలకొల్పారు. అంతేకాదు ఆమె రాష్ట్ర మంత్రి గాలి కరుణాకర్ రెడ్డిని ఓడించి అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. ఆమె మంత్రి కరుణాకర్‌రెడ్డిపై సుమారు 70 వేలకు పైగా ఓట్లు సాధించి ఎమ్మెల్యేగా గెలిచారు. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన లతా మల్లిఖార్జున్ ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించడం విశేషం.
    లక్ష్మీ ఆర్. హెబ్బాల్కర్
    గ్రామీణ బెల్గామ్ నుండి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన లక్ష్మీ ఆర్. హెబ్బాల్కర్ 78 వేలకు పైగా ఓట్లు సాధించి ఈ ఎన్నికల్లోనూ విజయం సాధించారు. తన సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకున్నారు.
    నయన మోతమ్మ
    నయన మోతమ్మ ముదిగెరె స్థానం నుండి పోటీ చేసి గెలిచారు. కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచిన నయన.. 21 వేలకు పైగా ఓట్లు సాధించి విజయబావుటా ఎగురవేశారు.
    శారదా పూర్యనాయక్
    షిమోగా రూరల్ స్థానం నుండి జేడీఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించారు. 48 వేలకు పైగా ఓట్లు సాధించి ఈ ఎన్నికల్లో విజయం సాధించారు.
    కారెమ్మదేవదుర్గ నియోజకవర్గం నుండి పోటీ చేసి విజయం సాధించారు కారెమ్మ. జేడీఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన కారెమ్మ 61 శాతానికి పైగా ఓట్లు సాధించి గెలుపొందారు.
    అయితే ఈ ఎన్నికల్లో మరోట్విస్ట్ కూడా చోటు చేసుకుంది. జయనగర్ నియోజవర్గానికి కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు సౌమ్య రెడ్డి. అయితే మొదట సౌమ్య రెడ్డి గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. 294 ఓట్ల మెజారిటీ సాధించినట్లు ప్రకటించారు. అయితే పోస్టల్ బ్యాలెట్లపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో, అధికారులు మరోసారి ఓట్లను లెక్కించగా.. కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్య కంటే బీజేపీ అభ్యర్థి సీకే రామమూర్తికి 16 ఓట్లు ఎక్కువ వచ్చాయి. అలా జయనగర్ లో బీజేపీ అభ్యర్థి సీకే రామమూర్తి ఎన్నికయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News