EPFO Rules Changed: ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో నడిచే ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ శుభవార్త అందించింది.
- Advertisement -
ఇటీవల ఉద్యోగుల సేవలను సులభతరం చేసేలా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. EPF విత్ డ్రా నియమాలను సవరించింది.
EPFO ఖాతాదారులు ఇప్పుడు నివాస ఆస్తి కొనుగోలు, నిర్మాణం లేదా EMI చెల్లింపు ప్రయోజనాల కోసం 90% నగదు ఉపసంహరించుకునేలా కొత్త నిబంధన తీసుకువచ్చింది.
అయితే ఐదు సంవత్సరాల PF సభ్యత్వం తర్వాత మాత్రమే ఈ నిబంధనలు అనుమతించబడ్డాయి. PF ఉపసంహరణలకు సంబంధించిన ఇతర కీలక మార్పులు కింద పేర్కొనబడ్డాయి.
జూన్ 2025 నుండి UPI – ATM ద్వారా అత్యవసర అవసరాల కోసం తక్షణమే లక్ష రూపాయల వరకు విత్డ్రా చేసుకోవచ్చు. ఆటోమేటిక్ క్లెయిమ్ సెటిల్మెంట్ పరిమితిని రూ. 1 లక్ష నుండి రూ. 5 లక్షలకు పెంచింది.
విద్య, వివాహం, వైద్య సంబంధిత ఉపసంహరణల ప్రయోజనాల కోసం ప్రక్రియలను సరళీకృతం చేసింది.