కొంతమంది నీటిని బాగా వేడి చేసి.. అందులో గుడ్లను జార విడుస్తారు. అలా అస్సలు చెయ్యొద్దు. అలా చేస్తే.. ఉష్ణోగ్రత ఒక్కసారిగా మారి, గుడ్లు పగలిపోతాయి. కాబట్టి చల్లని నీటిలోనే గుడ్లు వేసి, ఆ నీటినే మరిగించడం ఉత్తమం. అప్పుడు ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతుంది కాబట్టి.. గుడ్లు పగిలిపోయే అవకాశం ఉండదు.
గుడ్లను గిన్నెలో ఉంచి నీరు నెమ్మదిగా పొయ్యాలి. లేదా ముందే నీరు పోసి.. గుడ్లను నెమ్మదిగా జారవిడవాలి. అలాగే వాటిని ఉడికించేటప్పుడు.. మంట సిమ్ లేదా మీడియం ఉండాలి. హై ఫ్లేమ్ వద్దు. మంట ఎక్కువగా ఉంటే.. గుడ్లు ఉడికేటప్పుడు అటూ ఇటూ కదులుతూ.. ఒకదాన్ని ఒకటి ఢీకొట్టుకొని పగిలిపోగలవు. గుడ్లు ఉడుకుతున్న కాసేపటి తర్వాత మంటను మరింత తగ్గించుకోవడం మేలు. నెమ్మదిగా ఉడికితే గుడ్లు సేఫ్గా ఉంటాయి.
మీరు గమనిస్తే.. గుడ్డు వెనుక భాగంలో.. అంటే.. పెద్దగా ఉన్నవైపున ఒక చిన్న గాలి గదిలా ఉంటుంది. గుడ్డును ఉడికించేటప్పుడు ఆ గాలి బయటకు రావలసి ఉంటుంది. అది రాకపోతే గుడ్డు పగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక సూదితో గాలి గదికి చిన్న రంధ్రం పెడితే.. గాలి ఒత్తిడి బయటకు వెళ్లి, గుడ్డు పగలదు. కానీ ఈ చిట్కాతో ఓ సమస్య ఉంది. అన్ని గుడ్లకూ గాలి గది వెనకవైపే ఉండదు. ఒక్కోసారి మధ్యలో ఉంటుంది. ఎక్కడుందో గమనించాలి. అలాగే సూదితో గుచ్చేటప్పుడు పెద్దగా గుచ్చితే, గుడ్డు పగిలిపోగలదు.
గుడ్లను ఉడికించే నీటిలో ఒక స్పూన్ ఉప్పు లేదా కొద్దిగా వెనిగర్ వేస్తే.. ఉడికేటప్పుడు పెంకు పగిలినా, గుడ్డు బయటికి రాకుండా గట్టిగానే, అలాగే ఉంటుంది. ఎందుకంటే ఉప్పు, వెనిగర్ అనేవి గుడ్డులోని తెల్లసొనను వెంటనే గట్టిపడేలా చేస్తాయి. ఐతే.. మన ఇళ్లలో వెనిగర్ వాడేవాళ్లు చాలా తక్కువ. ఉప్పు అందరం వాడతాం. నీటిలో ఉప్పు వేస్తే.. గుడ్లు ఉప్పగా అయిపోతాయేమో అనే డౌట్ రావచ్చు. మనం వేసే ఉప్పు కొద్దిగానే కాబట్టి.. గుడ్లు సాల్టీగా అవ్వవు.
గదిలో ఉంచిన గుడ్లను వాడాలి. పూర్వం గుడ్లను వంటగదిలోనే ఉంచేవారు. ఎలుకలు తినకుండా.. షెల్ఫుల్లో దాచేవారు. ఇప్పుడు మనం ఫ్రిజ్లో స్టోర్ చేస్తున్నాం. ఐతే.. గుడ్లను ఉడికించాలి అనుకుంటే.. వాటిని ఫ్రిజ్ లోంచీ తియ్యగానే.. నీటిలో లేదా వేడి నీటిలో వెయ్యవద్దు. ముందు ఆ గుడ్లకు ఉన్న కూలింగ్ పోవాలి. అవి నార్మల్ టెంపరేచర్కి రావాలి. అందుకోసం మనం ఫ్రిజ్ నుంచి తీశాక.. కనీసం 15 నుంచి 20 నిమిషాలు బయట ఉంచాలి. వాటి కూలింగ్ తగ్గిన తర్వాత.. గిన్నెలోని నీటిలో నెమ్మదిగా వదలాలి. ఈ టిప్ మర్చిపోవద్దు. మీ బ్రెయిన్లో ఓ మూల స్టోర్ చేసుకోండి.
కొత్త గుడ్లు కాకుండా 3 5 రోజుల పాత గుడ్లు వాడాలి. ఇదే అక్షరాలా నిజం. కొత్త గుడ్లే ఇలా విరిగిపోతూ ఉంటాయి. ఎందుకంటే.. కొత్త గుడ్లకు పెంకు బలహీనంగా ఉంటుంది. కనీసం ఓ 3 రోజులైతే.. వాతావరణంలో మార్పుల వల్ల పెంకు బలంగా మారిపోతుంది. దాంతో.. ఉడికేటప్పుడు విరగదు. ఐతే.. ఇక్కడో సీక్రెట్ ఉంది. పాత గుడ్ల కంటే.. కొత్తవి, ఉడికించేటప్పుడు పగిలిన గుడ్లు చాలా రుచికరంగా ఉంటాయి. అందుకే కొంతమంది అడిగి మరీ కొత్త గుడ్లు కొనుక్కుంటారు. అది వేరే విషయం.
గుడ్లను ఉడికిస్తుంటే.. వాటిలో కొన్ని గుడ్లు పూర్తిగా ఉడకకుండానే పగిలిపోవడం సహజం. అయితే, గుడ్డు పగిలి లోపలున్న పదార్థం బయటకు వచ్చేసి.. నీటిలో ఉంటే.. అది మీకు అసౌకర్యంగా ఉంటుంది. ఇలాగైతే ఎగ్ కర్రీ సరిగా రాదు కదా అనే ఆలోచనకు రాగలరు. ఇలా అవ్వకుండా ఉండే, ఎంత బాగుండేది.. ఈ గుడ్లు ఎందుకిలా అయ్యాయి అని మీకు ఇరిటేషన్ వచ్చినా రావచ్చు. మరి అవి అలా విరిగిపోకుండా ఉండటానికి మనకు ఉపయోగపడే సింపుల్ చిట్కాలు చూద్దాం.
మీరు ఎక్కువ గుడ్లను ఉడికించాలి అనుకుంటే.. పెద్ద గిన్నెను వాడండి. అంతేగానీ.. గుడ్లను ఒకదానిపై ఒకటి పెట్టొద్దు. అలా పెడితే.. పై వరుసలో ఉన్న ఎగ్స్.. కింద ఉన్న గుడ్లపై ఎక్కువ ఒత్తిడి కలిగిస్తాయి. అందుకే సింగిల్ వరుసలోనే గుడ్లు ఉంటే మంచిది. కాగా.. గుడ్లు పగలకుండా ఉండాలంటే, ఈసారి ఈ సింపులు చిట్కాలను మీరూ ప్రయత్నించి చూడండి..!