Lahari Shari: లహరి శారీ ఎప్పుడూ ఏదో ఒక ఫారెన్ ట్రిప్స్ లో, హాట్ లుక్స్‌లో కనిపిస్తూ ఉంటుంది. తన అట్రాక్టివ్ ఫోటోలు, వీడియోలతో ఫాలోవర్స్‌కు సోషల్ మీడియాలో ఫుల్ మీల్స్ ఇస్తూ, యూత్‌లో విపరీతమైన ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.
ప్రెజెంట్ ట్రెండ్‌లో లహరి శారీ అంటే ఫారెన్ ట్రిప్స్, హాట్ లుక్స్ అనేంతగా ఫేమస్ అయింది.
సినిమాల్లోకి రాకముందు లహరి యాంకర్‌గా, మోడల్‌గా, అలాగే ఒక న్యూస్ ఛానెల్లో న్యూస్ రీడర్‌గా కూడా పనిచేసింది.
విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’లో డాక్టర్‌గా, ‘మళ్లీ రావా’, ‘జాంబీ రెడ్డి’ వంటి సినిమాలలో కొంచెం గుర్తింపు తెచ్చుకుంది లహరి.
బిగ్ బాస్ సీజన్ 5 లో మూడో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి, తన ముక్కుసూటి మాటలతో ఫేమస్ అయింది.
బిగ్ బాస్ లో ఉన్నప్పుడు యాంకర్ రవితో ఆమెకు ఉన్న ఫ్రెండ్షిప్ గురించి, నటి ప్రియ చేసిన కొన్ని కామెంట్స్ వల్ల లహరి బాగా ఫీల్ అయింది. ఈ ఇష్యూ అప్పట్లో బిగ్ బాస్ హౌస్‌లో పెద్ద గొడవగా మారింది. దాంతో లహరి బాగా వైరల్ అయ్యింది.
బిగ్ బాస్ తర్వాత, లహరి తన ట్రావెల్ పిక్స్‌తో మరింత హైలైట్ అయింది. ముఖ్యంగా, గోవా ట్రిప్‌లో దిగిన బికినీ ఫొటోలు పోస్ట్ చేసి ఫాలోవర్స్ కి పెద్ద షాక్ ఇచ్చింది. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.