అవకాడో పోషకాల నిధి. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు దీని ఆహారంలో చేర్చుకోవచ్చు. కొందరు దీనిని ‘హృదయ మిత్రుడు’ అని పిలుస్తే, మరికొందరు ‘బరువు తగ్గడానికి మేజిక్ ఫ్రూట్’ అని అంటారు. అయితే అవకాడో పండు తీసుకోవడం అందరికీ మంచిదు కాదు. ఇది కొందరికి అనారోగ్య పరిస్థితుల్లో హాని కలిగిస్తుంది.
ఇప్పటికే బరువు లేదా ఊబకాయంతో బాధపడుతుంటే, దీనికి దోరంగా ఉండటమే బెస్ట్. ఇందులో ఉండే కొవ్వు ఆరోగ్యకరమైనదే అయినప్పటికీ, దీనిలో కేలరీలు అధికంగా ఉంటాయి.
కిడ్నీ సమస్యలు ఉన్నవారు అవకాడో మితంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది.
లాటెక్స్ అలెర్జీలు ఉంటె వీలైనంతవరకు దీని తీసుకోవడం నివారించాలి. ఎందుకంటే ఇది సమస్యను మరింత తీవ్రం చేస్తాయి.
కాలేయ సమస్యలు ఉంటే అవకాడో తీసుకునే విషయంలో జాగ్రత్త వహించాలి. ఎందుకంటేఅవకాడో కాలేయంపై ఒత్తిడి తెస్తుంది.