Thursday, May 9, 2024
Homeహెల్త్Green tea makes you ever young: గ్రీన్ టీతో మెరిసే చర్మం

Green tea makes you ever young: గ్రీన్ టీతో మెరిసే చర్మం

ఇది జీరో క్యాలరీ కూడా

గ్రీన్ టీ చర్మ సంరక్షణకు ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో యాంటాక్సిడెంట్లు, యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు బాగా ఉంటాయి. గ్రీన్ టీ యాంటి ఏజింగ్ ఏజెంట్ గా బ్యూటీ నిపుణులు పేర్కొంటారు. బ్లాక్ టీ, ఊలాంగ్ టీ ల కన్నా కూడా గ్రీన్ టీ ఎంతో మంచిదంటారు. పండిన రుతువును, ప్రోసెసింగ్ ప్రమాణాలను బట్టి, పెరిగిన వాతావరణ పరిస్థితులను బట్టి గ్రీన్ టీలో ఎన్నో వెరైటీలు కూడా ఉన్నాయి.

- Advertisement -

గ్రీన్ టీని నిత్యం తాగడం వల్ల రకరకాల జబ్బులు తగ్గుతాయని పలు శాస్త్రీయ అధ్యయనాల్లో సైతం తేలింది. గ్రీన్ టీ వల్ల పొందే ప్రధానమైన లాభం ఏమిటంటే ఇది స్కిన్ నాణ్యతను బాగా మెరుగుపరుస్తింది. చర్మం ఆరోగ్యంగా ఉండేలా తోడ్పడుతుంది. గ్రీన్ టీ తాగడం వల్ల యాక్నే సమస్య
తగ్గుతుంది. గ్రీన్ టీలో ఇజిసిజి అనే పొలిఫెనలిక్ కాంపౌండ్ ఉంది. ఇది సహజసిద్ధమైన యాంటిఇన్ఫమ్లేటరీ, యాంటాక్సిడెంట్ స్వభావాన్ని కలిగి ఉంది. యాక్నే తదితర పలు చర్మ ఇన్ ఫెక్షన్లపై గ్రీన్ టీ ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది.

అతినీలలోహిత కిరణాల బారిన పడడం వల్ల తలెత్తే పలు చర్మ సమస్యలపై ఫార్మొకలాజికల్ ఏజెంటుగా గ్రీన్ టీ పనిచేస్తుంది. గ్రీన్ టీ సహజసిద్ధమైన యాంటి యాండ్రోజెనిక్ గా పనిచేస్తుంది. ఇది శరీరంలోని యాండ్రోజెన్స్ ఉత్పత్తిని క్రమబద్ధీకరిస్తుంది. దీంతో చర్మంపై సెబమ్ లేదా నూనె ఉత్పత్తిని తగ్గిస్తుంది. ముడతలు పడ్డం, కాంతివిహీనంగా కనిపించడం వంటి లక్షణాలు చర్మంపై తొందరగా తలెత్తకుండా చర్మాన్ని ఎవర్ గ్రీన్ గా గ్రీన్ టీ ఉంచుతుంది. యంగ్ గా కనిపించేలా చేస్తుంది.

సీజన్ల వారీగా ఉత్పత్తి అయిన గ్రీన్ టీ ఎక్స్ ట్రాక్ట్స్ వినియోగంతో పాటు ఈ టీని నిత్యం తాగడం వల్ల చర్మం ఎలాస్టిసిటీ పెరుగుతుంది. ఫలితంగా చర్మంపై వ్రుద్ధాప్యపు ఛాయలు తొందరగా ఏర్పడవు. చర్మంపై గ్రీన్ టీ మంచి మాయిశ్చరైజర్ ఏజెంటుగా కూడా పనిచేస్తుంది. అంతేకాదు చర్మంపై సూర్యరశ్మి దుష్పరిణామాలను రివర్స్ చేస్తుంది. గ్రీన్ టీలో కొద్దిగా కెఫైన్ కూడా ఉంటుంది కాబట్టి దీని వినియోగంలో పోషకాహారనిపుణుల సలహా తీసుకుంటే ఇంకా మంచిది. కెఫైన్ ఉంటుందని కాఫీని తాగకుండా ఉంటున్న
వాళ్లకు గ్రీన్ టీ మంచిదే. గ్రీన్ టీలో కూడా కెఫైన్ ఉంటుంది కానీ తక్కువ పాళ్లల్లో మాత్రమే ఉంటుంది. అందుకే కాఫీ కన్నా గ్రీన్ టీ తాగితే ఎంతో మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News