Monday, May 20, 2024
Homeహెల్త్Apple Cider Vinegar magic on skin: చర్మాన్ని మెరిపించే యాపిల్ సిడార్ వెనిగర్

Apple Cider Vinegar magic on skin: చర్మాన్ని మెరిపించే యాపిల్ సిడార్ వెనిగర్

అతిగా వాడకుండా మితంగా, జాగ్రత్తగా..

చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే యాపిల్ సిడార్ వెనిగర్ మంచి ఔషధంలా పనిచేస్తుంది. యాక్నే, నల్లమచ్చలను పోగొడుతుంది. చర్మాన్ని మ్రుదువుగా చేస్తుంది. అంతేకాదు మీ స్కిన్ ని పట్టులా మెరిపిస్తుంది. యాపిల్ సిడార్ లో చర్మానికే కాదు శరీరానికి సంబంధించిన ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎన్నో దాగున్నాయి. ఇది వంటల్లోనే కాదు చర్మ సంరక్షణలో కూడా పెద్ద పవర్ హౌస్ లాంటిది. యాపిల్ జ్యూసును పులియబెట్టి యాపిల్ సిడార్ వెనిగర్ ను తయారు చేస్తారు. ఎసిటిక్ యాసిడ్, ఎంజైములు, మరెన్నో లాభకరమైన పదార్థాలు ఇందులో ఉంటాయి. ఇవన్నీ యాంటీ బాక్టీరియల్, యాంటి ఫంగల్ సుగుణాలు కలిగున్నాయి. వీటిల్లో యాంటాక్సిడెంట్ గుణాలు కూడా బాగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యపరమైన లాభాలనే కాదు చర్మ సంరక్షణకు కూడా ఎన్నో మేళ్లు చేకూరుస్తాయి. చర్మం సహజసిద్ధమైన పిహెచ్ సమతుల్యతను కాపాడుతూ చర్మాన్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో చర్మంపై హానికరమైన బాక్టీరియా చేరదు. ముందరే చెప్పుకున్నట్టు యాపిల్ సిడార్ వెనిగర్ లో యాంటి బాక్టీరియల్ సుగుణాలు చాలా ఉన్నాయి.

- Advertisement -

ఇవి యాక్నే, నల్ల మచ్చలపై శక్తివంతంగా పోరాడి వాటిని పోగొడతాయి. దీన్ని చర్మంపై రాసుకోవడం వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. యాక్నే బ్రేకవుట్లకు కారణమైన బాక్టీరియాను సైతం నిలువరిస్తుంది. యాపిల్ సిడార్ వెనిగర్ మంచి ఎక్స్ ఫొయిలేటర్ గా పనిచేస్తుంది. చర్మంపై ఉండే మ్రుత కణాలను పోగొడుతుంది. అంతేకాదు కొత్త కణాలను వ్రుద్ధిచేస్తుంది. ఫలితంగా చర్మం కాంతిని సంతరించుకుంటుంది. చర్మంపై ఏర్పడ్డ నల్లమచ్చలను పోగొడుతుంది. స్కిన్ టోన్ సమం చేస్తుంది. ఎగ్జిమా వంటి ఇరిటేషన్ల నుంచి యాపిల్ సిడార్ లోని యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎంతో స్వాంతననిస్తాయి. దురద, దద్దుర్లు ఉన్న చోట పలచగా చేసిన యాపిల్ సిడార్ వెనిగర్ ను అప్లై చేయొచ్చు.

అంతేకాదు యాపిల్ సిడార్ వెనిగర్ చర్మం పిహెచ్ ను సంరక్షించడం వల్ల చర్మంలోని మాయిశ్చరైజర్ ప్రమాణాలు బాగా ఉంటాయి. అంతేకాదు ఇది నేచురల్ టోనర్ గా కూడా ఉపయోగపడుతుంది. చర్మాన్ని బిగువుగా ఉంచుతుంది. యాపిల్ సిడార్ వెనిగర్ స్కిన్ కేర్ సంబంధించి రకరకాలుగా ఉపయోగపడుతుంది. యాపిల్ సిడార్ వెనిగర్, నీళ్లు రెండింటినీ సమపాళ్లల్లో తీసుకుని బాగా కలిపి ఆ మిశ్రమంలో కాటన్ బాల్ ముంచి ముఖంపై రాసుకుంటే చర్మం పిహెచ్ సమతుల్యం అవుతుంది. అలా మంచి స్కిన్ టోనర్ గా కూడా ఇది ఉపయోగపడుతుంది.

అలాగే యాపిల్ సిడార్ వెనిగర్ ని తేనె, పెరుగు లేదా మట్టి మిశ్రమంలో కలిపి ముఖానికి ఫేషియల్ గా వేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే మీ చర్మం కాంతివంతంగా తయారవుతుంది. పలచగా చేసిన యాపిల్ సిడార్ వెనిగర్ లో కాటన్ బాల్ ను ముంచి ముఖంపై ఉన్న మచ్చలపై, యాక్నేపై అప్లై చేస్తే కూడా మంచి ఫలితం కనిపిస్తుంది. యాపిల్ సిడార్ వెనిగర్ లోని యాంటి బాక్టీరియల్ గుణాల వల్ల చర్మంపై మంట తగ్గడమే కాకుండా వేగంగా యాక్నేను కూడా తగ్గిస్తుంది. అయితే యాపిల్ సిడార్ వెనిగర్ ను చర్మంపై అప్లై చేసే ముందు కాన్సెంట్రేటెడ్ యాపిల్ సిడార్ వెనిగర్ ని పలచగా చేయడం మరవొద్దు. చర్మంపై ప్రతికూల ప్రభావం చూపకుండా ఉండేందుకు దీనితో మొదట స్కిన్ పై ప్యాచ్ టెస్టును తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే చర్మ సంబంధిత సమస్యలు ఏమైనా ఉంటే కూడా చర్మ నిపుణుల సలహాను తీసుకున్న తర్వాతే దీన్ని వాడాలి.

ఆరోగ్యవంతమైన చర్మం కోసం యాపిల్ సిడార్ వెనిగర్ ను డైట్ రూపంలో కూడా రకరకాలుగా ఉపయోగించవచ్చు. గ్లాసుడు నీళ్లల్లో టేబుల్ స్పూన్ యాపిల్ సిడార్ వెనిగర్ వేసి అందులో నిమ్మకాయ పిండాలి. దానితో పాటు టీస్పూను తేనెను కూడా అందులో కలపాలి. ఆహారం బాగా జీర్ణమయ్యేలా ఈ డ్రింకు చేయడమే కాకుండా శరీరంలోని మలినాలను, విషతుల్యపదార్థాలను కూడా బయటకు పంపేస్తుంది. దీంతో చర్మం శుభ్రంగా ఉండి మెరుపులు చిందిస్తుంది. అలా యాపిల్ సిడార్ వెనిగర్ ను డిటాక్సిఫైయింగ్ డ్రింకుగా తీసుకోవచ్చు. అలాగే మీరు ఉదయం పూట తినే స్మూదీపై కూడా యాపిల్ సిడార్ వెనిగర్ ను చల్లుకోవచ్చు. పండ్లు, ఆకుకూరలు, పెరుగు కలిపి దానిపై యాపిల్ సిడార్ వెనిగర్ ను కాస్త జోడించి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఇందులో యాంటాక్సిడెంట్లతో పాటు చర్మ సంరక్షణకు ఉపయోగపడే ఎన్నో న్యూట్రియంట్లు ఉంటాయి. చర్మాన్ని ఆరోగ్యంగా, మ్రదువుగా ఉంచే హెర్బల్ టీని కూడా యాపిల్ సిడార్ వెనిగర్ తో తయారుచేసుకోవచ్చు. చమోమైల్ లేదా మింట్ టీలో టీస్పూను యాపిల్ సిడార్ కలిపి తీసుకుంటే చర్మం పట్టులా మెత్తగా తయారవుతుంది. అంతేకాదు ఫ్రూట్ సలాడ్ పై కూడా యాపిల్ సిడార్ వెనిగర్ తో పాటు చిటికెడు దాల్చినచెక్క పొడి, తేనె లైట్ గా చల్లి ఫ్రూట్ సలాడ్ ను డ్రెస్సింగ్ చేసి తింటే చాలా బాగుంటుంది.

ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మరింత కాంతివంతంగా కనిపించేట్టు చేస్తుంది. వర్కవుట్లు చేసిన తర్వాత డీహైడ్రేట్ అయిన శరీరాన్ని రీహైడ్రేట్ చేయడంలో కూడా యాపిల్ సిడార్ వెనిగర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. కొబ్బరినీళ్లు, యాపిల్ సిడార్ వెనిగర్, కొద్దిగా అలొవిరా జ్యూసు మూడింటినీ కలిపి డ్రింకులా చేసుకుని తీసుకుంటే అది శరీరానికి కావలసిన ఎలక్ట్రలైట్స్ ను ఇవ్వడమే కాకుండా చర్మానికి రేడియంట్ కాంప్లెక్షన్ ఇస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News