Monday, May 20, 2024
Homeహెల్త్Barley water to loose weight: సన్నగవ్వాలంటే బార్లీ తాగాల్సిందే

Barley water to loose weight: సన్నగవ్వాలంటే బార్లీ తాగాల్సిందే

ఇంట్లో సింపుల్ గా ఈ డీటాక్స్ డ్రింక్ చేసుకోండి

బరువు తగ్గించే బార్లీ

- Advertisement -

లావుగా ఉన్నారా? బరువు తగ్గాలనుకుంటున్నారా? ఇందుకు మీ కిచెన్ లోనే మంచి ప్రత్యామ్నాయం ఉంది. ఈ పని బార్లీ గింజలు బాగా చేస్తాయి. వీటిల్లోని పీచుపదార్థాలు బరువును తగ్గించడంలో ఎంతో బాగా పనిచేస్తాయి. ఇందులోని పీచుపదార్థాల వల్ల ఆకలి తొందరగా వేయదు. కడుపు నిండుగా ఉంటుంది.

ఒక గ్లాసుడు బార్లీ నీళ్లల్లో శరీర బరువును తగ్గించే ఎన్నో పోషకాలు ఉన్నాయి. శరీరంలోని కొలెస్ట్రాల్ ప్రమాణాలను ఇది తగ్గిస్తుంది. ఇందులోని బేటా గ్లుకాన్ అనే పదార్థంలో పీచును కరిగించే గుణాలు బాగా ఉన్నాయి. నిత్యం బార్లీని తీసుకోవడం వల్ల శరీరంలోని మలినాలు మూత్రనాళం నుంచి బయటకు పోతాయి. అంతేకాదు మూత్రనాళంలో తలెత్తే ఇన్ఫెక్షన్లను నివారించడంలో కూడా బార్లీ నీళ్లు ఎంతో శక్తివంతంగా పనిచేస్తాయి. కిడ్నీలో రాళ్లను కూడా బార్లీ కరిగిస్తుంది. బార్లీ గింజల్లోని గ్లైసెమిక్స్ ఇండెక్స్ గుణాల వల్ల బ్లడ్ షుగర్ ప్రమాణాలను క్రమబద్ధీకరించడం ద్వారా శరీర బరువును తగ్గించడంలో బార్లీ తోడ్పడుతుంది.

శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. జీర్ణావయాన్ని శుభ్రం చేస్తుంది. శరీరాన్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచుతుంది. బార్లీ నీళ్లు తాగడం వల్ల అందులోని పీచుపదార్థాలతో కడుపు నిండుగా ఉండి ఆకలి వేయదు. అలా బరవును తగ్గించడంలో బార్లీ నీళ్లు బాగా పనిచేస్తాయి. జంక్ ఫుడ్ జోలికి పోరు. బార్లీ గ్రాస్ జ్యూసు తాగడం వల్ల కూడా వెయిట్ లాస్ అవుతారు. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటే అనారోగ్య సమస్యలు చాలా తగ్గుతాయి. అందుకే ఆయుర్వేద వైద్యంలో బార్లీ నీళ్లను ఒక టానిక్ గా పేర్కొంటారు. మలబద్దకం, డయేరియా వంటి జీర్ణ సంబంధ సమస్యలను కూడా బార్లీ నీళ్లు తగ్గిస్తాయి. బార్లీ గింజలను నీళ్లల్లో నానబెట్టి ఆ నీళ్లను వడగట్టి తాగితే శరీరంలోని కాలరీలు బాగా తగ్గుతాయి. ఇందులో ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. బార్లీలోని ఐరన్ శరీరంలోని రక్తాన్ని పెంపొందించి అలసట, బద్ధకం, ఏకాగ్రత వంటి శరీరక సమస్యలను పరిష్కరిస్తుంది.

ఇక బార్లీలోని యాంటాక్సిడెంట్లు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను దృఢం చేస్తాయి. జలుబు, దగ్గు, జ్వరం వంటి వాటికి లోనుకాకుండా నియంత్రిస్తాయి. రక్తపోటును కూడా బాగా నియంత్రిస్తాయి. శరీరంలోని రక్తకణాల వృద్ధికే కాకుండా మూత్రపిండాలు ఆరోగ్యంగా పనిచేసేలా చేయడంలో కూడా బార్లీ గింజలు బాగా పనిచేస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే బార్లీ జీరో కాలరీ, జీరో కొలెస్ట్రాల్ ఫుడ్. ఇక వేసవిలో బార్లీ నీళ్లు చేసే మేలు ఎంతో.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News