Monday, May 20, 2024
Homeహెల్త్Summer care with Aloe Vera: సమ్మర్ లో అలోవిరా ..

Summer care with Aloe Vera: సమ్మర్ లో అలోవిరా ..

మీ ఇంట్లో ఓ నాలుగైదు అలోవేరా మొక్కలు పెట్టుకోండి..

వేసవిలో అలొవిరాతో…

- Advertisement -

వేసవి స్కిన్ కేర్ రొటీన్ లో అలొవిరా వల్ల పొందే ప్రయోనాలు ఎన్నో. చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా, పట్టులా మెరిపిస్తుంది అలొవిరా. అలొవిరా చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. చర్మాన్ని మ్రుదువుగా చేస్తుంది. మాయిశ్చరైజర్ గా, టోనర్ గా, ఫేస్ మాస్కులో, కళ్ల కింద ఏర్పడే నల్లటి వలయాల నుంచి స్వాంతన నిచ్చే క్రీముగా ఇలా అన్ని రకాలుగా అలొవిరాను వాడొచ్చు.

అలొవిరా వేసవిలో చర్మాన్ని ఎంతో తాజాగా ఉంచుతుంది. మెరిసేలా చేస్తుంది. ఇది సహజసిద్ధమైన మాయిశ్చరైజర్. ముఖానికి సన్ స్క్రీన్ రాసుకోవడానికి లేదా మేకప్ వేసుకోవడానికి ముందు అలొవిరా జెల్ ను పలుచటి లేయర్ లా ముఖానికి రాసుకుంటే ఎంతో మంచిది. అలొవిరా మంచి కూలింగ్ ఏజెంట్ కూడా. అందుకే వేసవిలో ఇది చర్మరక్షణకు బాగా ఉపయోగపడుతుంది. వేసవిలో చాలామందికి దద్దుర్లు, ఇరిటేషన్లు తలెత్తుతుంటాయి. వీటిపై అలొవిరా జెల్ అప్లై చేయడం వల్ల మంట తగ్గుతుంది. ఇది చర్మానికి చల్లదనాన్నిఇవ్వడమే కాకుండా ఎంతో సాంత్వననిస్తుంది. వేసవిలో చర్మం టెక్స్చెర్ బాగుండేలా అలొవిరా ఫేస్ మాస్కు ఉపయోగపడుతుంది. చర్మంపై ఏర్పడ్డ యాక్నే తగ్గుతుంది.

ఒక టేబుల్ స్పూన్ అలొవిరా జెల్ తీసుకుని అందులో టీస్పూను తేనె, నిమ్మరసం కలిపి పేస్టులా చేసి ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. తర్వాత చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి. ఇలా చేస్తే చర్మం ఎంతో మ్రుదువుగా తయారవుతుంది. స్కిన్ టోనర్ గా కూడా అలొవిరా పనిచేస్తుంది. చర్మంలోని పిహెచ్ ప్రమాణాలను సమతుల్యం చేస్తుంది. అలొవిరా జెల్, నీళ్లు రెండింటినీ సమాన పరిమాణాల్లో తీసుకుని ఆ మిశ్రమాన్ని కాటన్ ప్యాడ్ తో ముఖానికి ఒత్తుతూ మ్రుదువుగా రాసుకోవాలి. అలాగే కళ్ల కింద ఏర్పడే నల్లటి వలయాలు తగ్గడానికి కూడా అలొవిరా క్రీము ఉపయోగపడుతుంది. కళ్ల కింద వాపును సైతం అలొవిరా ఐ క్రీము తగ్గిస్తుంది. అందుకే రాత్రి నిద్రపోయే ముందు కళ్ల కింద అలొవిరా జెల్ రాసుకుని పడుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

అలొవిరాను బాడీ లోషన్ గా కూడా వాడొచ్చు. ఇది శరీర చర్మాన్ని పట్టులా చేస్తుంది. స్నానం చేసిన తర్వాత అలొవిరా జెల్ ను శరీరానికి రాసుకుంటే చర్మం మ్రుదువుగా అవుతుంది. అలొవిరా సహజసిద్ధమైన లిప్ బామ్. ఆ జెల్ ను పెదవులకు రాసుకుంటే కావలసినంత హైడ్రేషన్ అందడంతొ నాటె చర్మాన్ని సూర్యరశ్మి బారిన పడకుండా కూడా ఈ బామ్ కాపాడుతుంది. మీ పెదవులు నున్నగా మెరుస్తూ ఉండాలంటే కాస్తంత అలొవిరా జెల్ ను పెదాలకు రాసుకుంటే చాలు. అలొవిరా స్క్రబ్ మంచి ఎక్స్ ఫొయిలేటర్ గా కూడా పనిచేస్తుంది. ఈ స్క్రబ్ ను ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. ముందుగా రెండు టేబుల్ స్పూన్ల స్వచ్ఛమైన అలొవిరా జెల్, ఒక టేబుల్ స్పూన్ ముడి తేనె, పావు కప్పు ఆర్గానిక్ సముద్రపు ఉప్పు తీసుకోవాలి. పావుకప్పు సముద్ర ఉప్పులో అలొవిరా జెల్ కలిపి పేస్టులా చేయాలి. అందులో ముందు చెప్పిన పరిమాణంలో ముడి తేనెను కలపాలి. అంతే . అలొవిరా స్క్రబ్ రెడీ. ఈ స్క్రబ్ ను ముఖానికి పూసుకొని మసాజ్ చేయాలి. కాసేపు అలాగే ఉంచుకొని గోరువెచ్చటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి. దీంతో చర్మంపై మలినాలు పోయి శుభ్రం అయి మిల మిలలాడుతుంది.

వీటన్నింటితో పాటు నీళ్లు బాగా తాగడం, ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకోవడం, ఇంటిపట్టున ఉండడం, చర్మన్ని క్లీన్సింగ్ చేసుకోవడం, ఎక్స్ ఫొయిలేట్ చేసుకోవడం, తక్కువ మేకప్ వేసుకోవడం, చేతులకు మాయిశ్చరైజర్ పెట్టుకోవడం వంటివి వేసవి స్కిన్ కేర్ రొటీన్ లో తప్పనిసరిగా చేసుకోవాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News