Sunday, October 6, 2024
Homeహెల్త్Biryani health benefits: బిర్యానీ ఆరోగ్యానికి చాలా మంచిది

Biryani health benefits: బిర్యానీ ఆరోగ్యానికి చాలా మంచిది

బిర్యానీ అంటే నచ్చనిది ఎవరికి? పిల్లా, పెద్దా అందరికీ బిర్యానీ మోస్ట్ ఫేవరెట్ ఐటెంగా పాపులర్ అయింది. ఫంక్షన్, పార్టీ ఏదైనా బిర్యానీ మాత్రం మస్ట్ గా ఉండాల్సిందే అనేలా మనవాళ్లు టన్నులకొద్దీ బిర్యానీని లొట్టలేసుకుని తినేస్తున్నారు. మనదేశంలో ప్రతి ప్రాంతంలోనూ వెరైటీ బిర్యానీలు చేస్తారు. లక్నో బిర్యానీ, బెంగాలీ బిర్యానీ, చెన్నై బిర్యానీ, బెంగళూరు బిర్యానీ, హైదరాబాద్ దమ్ బిర్యానీ..ఇలా లిస్టు చెప్పుకుంటూ పోతే చాలా పెద్దది వస్తుంది. అందుకే బిర్యానీలో ఏముంది, ఇది తింటే ఆరోగ్యం పరిస్థితి ఏమిటనే విషయంపై ఓ స్టడీ కూడా జరిగింది.

- Advertisement -

జనరల్ గా మనం బిర్యానీ అనగానే కార్బ్-రిచ్, అన్ హెల్తీ డిష్ అనేసుకుంటాం. కానీ ఆఫ్రికన్ జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అధ్యయనం ప్రకారం బిర్యానీ హెల్త్ కు చాలా మంచిదట.

ఎందుకంటే హైదరాబాదీ బిర్యానీలో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువట. ఇందులో ఉన్న మసాలాలు, పసుపు, మిరియాలు, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, కుంకుమ పువ్వులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి. ఇంటర్నల్ ఆర్గాన్స్ కు ఇది చాలా మంచిది. బ్లోటింగ్ ను పోగొట్టేలా పసుపు, మిరియాలు పని చేసి, జీర్ణం బ్రహ్మాండంగా అయ్యేలా చేస్తాయి. అల్లం, జీలకర్ర నాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ గా పనిచేసి, మన బాడీ డీటాక్సిఫై అయ్యేలా చూస్తాయి. జీర్ణక్రియలో సహాయపడే ఎంజైమ్స్ బాగా రిలీజ్ అయ్యేలా ఇవన్నీ పనిచేస్తాయి.

జీలకర్ర, పసుపు ఈ రెండూ కూడా యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్ల మేటరీ, యాంటీ-ట్యూమర్, యాంటీవైరల్ కూడానూ. కాబట్టి ఇది ఆల్ ఇన్ వన్ క్లెన్సింగ్ సుగంధ ద్రవ్యం అన్నమాట. లివర్ ఎంజైమ్స్ పెరిగేలా చేస్తూ, తద్వారా బాడీని డీటాక్సిఫై చేసాల సాఫ్రన్ సహకరిస్తుంది. బిర్యానీలో ఉన్న సాఫ్రన్ వల్ల మనకు ఆరోగ్యం ఒనగూరుతుందన్నమాట.

ఆనియన్, జింజర్, గార్లిక్ వంటివి పుష్కలంగా ఉన్న బిర్యానీ తిన్నప్పుడు మన ఒంటికి అవసరమైన అలిసిన్, సల్ఫ్యూరిక్ కాంపౌండ్స్, మాంగనీస్, విటమిన్ బీ6, సీ, కాపర్, సెలీనియం వంటి విటమిన్లన్నీ ఇందులో ఉన్నాయి. ఇక బిర్యానీలో ఉన్న స్పైసెస్ గ్లూటథియాన్ అంటే లివర్ యాంటీఆక్సిడెంట్స్ ను బాగా పెంచుతుంది. ఇది కూడా డీటాక్సిఫై చేసి ఇంటర్నల్ ఆర్గాన్స్, లివర్ హెల్త్ మెరుగు పరుస్తుంది.

వల్డ్ ఫేమస్ హైదరాబాద్ బిర్యానీలో అన్ని న్యూట్రిషనల్ వాల్యూస్, హెల్త్ బెనిఫిట్స్ ఉన్నట్టు స్టడీలో తేలింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News