Monday, May 20, 2024
Homeహెల్త్Carrot salad: క్యారెట్ సలాడ్ తింటే..

Carrot salad: క్యారెట్ సలాడ్ తింటే..

ఆరోగ్యానికి మంచిదని అతిగా పచ్చి కూరగాయలు తినేయకండి

మేని మెరుపుకు క్యారట్ సలాడ్…

- Advertisement -

క్యారట్ సలాడ్ తో మీ చర్మం మెరిసిపోతుంది. అదెలా అంటారా? విటమిన్ ఎతో నిండివున్న ఈ సలాడ్ బయటే కాదు మీ చర్మం లోపల సైతం పరిశుభ్రంగా ఉంచుతుంది. చర్మానికి క్యారట్ చాలా మంచిది. కారణం వీటిల్లో విటమిన్ ఎ (రెటినల్) బాగా ఉంటుంది. పచ్చి క్యారట్ లు తిన్నా మెరిసే చర్మం సొంతమవుతుందని అనుకుంటాం. కానీ కేవలం విటమిన్ ఎ చర్మాన్ని కాంతివంతం చేయలేదంటున్నారు పోషకాహార నిపుణులు.

మరి మెరిసే చర్మం కోసం క్యారట్ లను ఎలా తినాలి? ప్రముఖ న్యూట్రిషనిస్టు పూజా బోహ్రా రెడ్ క్యారట్ సలాడ్ తో ఇది సాధ్యమంటున్నారు. ఈ సలాడ్ ను తింటే చర్మం కాంతివంతంగా తయారవుతుందంటున్నారు. పలు చర్మ క్రీముల్లో కూడా విటమిన్ ఎ (రెటినల్) ను కలుపుతుంటారు కాస్మొటిక్ ఉత్పత్తిదారులు కూడా. రెటినల్ చర్మ కణాల ఉత్పత్తిని పెంచుతుంది. మూసుకుపోయిన చర్మ రంధ్రాలను గాలి తగిలేలా చేస్తుంది. అంతేకాదు చర్మాన్ని ఎక్స్ ఫొయిలేట్ చేస్తుంది కూడా. పైగా కొల్లాజెన్ ఉత్పత్తిని కూడా బాగా పెంచుతుంది. దీంతో చర్మంపై ఫైన్ లైన్స్ గాని, ముడతలు ఏర్పడవు.

కనిపించవు కూడా. అంతేకాదు చర్మానికి మెరుపును, నిండైన సొగసును ఇస్తాయి. మీరు తినే డైట్ లో బెటాకెరొటినా చేర్చడం వల్ల కూడా విటమిన్ ఎ శరీరానికి అందుతుంది. బెటాకెరొటినాను శరీరం రెటెనల్ గా మారుస్తుంది. క్యారట్లల్లో బేటాకెరొటినా పుష్కలంగా ఉంటుంది. విటమిన్ ఎ ఫ్యాట్ సొల్యుబుల్ కాంపొనెంట్ కూడా. ఇది స్కిన్ కు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పుడు చెప్పుకునే రెడ్ క్యారట్ సలాడ్ లోని రెటినల్ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.

ఈ సలాడ్ లో ఉపయోగించే వెనిగర్ జీర్ణక్రియ బాగా జరిగేలా చేస్తుంది. దీంట్లో వాడే ఎడిబుల్ కోకోనట్ ఆయిల్ గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది. సముద్ర ఉప్పు అన్నింటి సమతుల్యతకు తోడ్పడుతుంది. ఇక
ఇందులో ఉపయోగించే నువ్వులైతే యాంటాక్సిడెంట్ల నిధి.

న్యూట్రియంట్ రిచ్ సలాడ్ అయిన దీన్ని చేయాలంటే రెండు లేదా మూడు రెడ్ క్యారట్లను తీసి వాటిని బాగా కడగాలి. వాటిపై ఉండే తొక్కను శుభ్రంగా తీసేయాలి. క్యారట్ కొసళ్లను కట్ చేయాలి. తర్వాత వాటిని సన్నని ముక్కలుగా కోయాలి. ఒక ప్లేటు తీసుకుని ఒక టీస్పూను నిమ్మరసం లేదా వెనిగర్, ఒక టీస్పూన్ ఎడిబుల్ కోకోనట్ ఆయిల్ ప్లేటులో వేసి దాన్ని బాగా కలపాలి. దాంట్లో తరిగిపెట్టుకున్న సన్నటి క్యారెట్ ముక్కలను కూడా వేసి ఆ మిశ్రమాన్ని బాగా కలపాలి. దానిపై కొద్ది సముద్ర ఉప్పు, నువ్వులు చల్లి దానిని బాగా కలపాలి. అంతే. తర్వాత దాన్ని స్పూనుతో ఆరంగించండి. ఇది మీ చర్మాన్ని కాంతివంతం చేసే సరికొత్త బ్యూటీ సీక్రెట్ అంటున్నారు పోషకాహార నిపుణులు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News