Sunday, July 7, 2024
Homeహెల్త్Cleaning tips: ఇంట్లో క్లీనింగ్ కు కొన్ని టిప్స్

Cleaning tips: ఇంట్లో క్లీనింగ్ కు కొన్ని టిప్స్

 మందంగా ఉండే దుస్తులు, దుప్పట్లలాంటివి ఉతకడం ఒక ఎత్తయితే అవి ఆరడం మరొక ఎత్తు. ఎందుకంటే అవి తొందరగా ఆరవు. అలాగే పక్కల మీద, సోఫాల మీద వేసుకునే కుషన్లు మెటీరియల్ కూడా ఉతికితే ఒకపట్టాన తొందరగా ఆరవు. ముఖ్యంగా పక్క మీద పరుచుకునేవి కూడా తొందరగా ఆరవు. అయితే ఇలాంటి మందమైన బట్టలను టెన్నిస్ బాల్స్ తొందరగా ఆరేలా చేస్తాయి. దీనికి మీరు చేయాల్సిందల్లా వాషింగ్ మెషీన్ ను ఆర్డినరీ డ్రైయింగ్ సెట్టింగ్ లో ఉంచి ఒక టెన్నిస్ బాల్ ను అందులో వేయాలి. ఈ స్పోర్ట్సు బాల్ తో మిషన్ డ్రైయింగ్ సిస్టమ్ వాటిని వేగంగా డ్రై చేస్తుంది.

- Advertisement -

 ఇంట్లోని పైపులు, డ్రైనేజిలు హఠాత్తుగా మూసుకుపోయి ఎంతో ఇబ్బంది పడుతుంటాం. బేకింగ్ పౌడర్, వెనిగర్ సహాయంతో ఈ సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చు. మూసుకుపోయిన పైపుల్లో శుద్ధమైన వంటసోడాను అర టేబుల్ స్పూను పోసి కాసేపైన తర్వాత అందులో వెనిగర్, ఉడికిన నీళ్లను సమపాళ్లలో తీసుకుని ఆ రెంటిని బాగా కలిపి ఆ పైపుల్లో పోయాలి. దీంతో పైపు మూసుకుపోయేలా చేసిన వ్యర్థాలన్నీ పోయి అందులో పేరుకుపోయిన మురికి పోయి పైపులు బాగా పనిచేస్తాయి.

 ఉడెన్ ఫ్లోర్స్ పై గీతలు, రకరకాల మచ్చలు పడి చూడడానికి అసహ్యంగా కనిపిస్తుంటాయి. ఇలాంటి మరకలను స్టీలు పీచుతో రుద్దితే పోతాయి.

 నిమ్మ తొక్కలతో వంటింట్లో ఉండే కూలరు, ఒవెన్, స్పిగోట్, ఇతర స్టీలు సాధనాలను మెరిసేలా శుభ్రంచేయొచ్చు. వాటిపై ఏర్పడిన మొండి నీటి మరకలను కూడా నిమ్మ తొక్కలతో పోగొట్టవచ్చు.

 ఇంట్లో వస్తువులపై పేరుకున్న మురికి, దుమ్ము పోగొట్టడంలో ఎక్స్ ప్రెసో, కాఫీ ఫిల్టర్స్ ఎంతో సహాయపడతాయి.

 వంటింట్లో ఉండే వాష్ బేసిన్ లో ఆహారపదార్థాల కారణంగా దుర్వాసన తలెత్తడం తెలిసిందే. ఇది లేకుండా ఉండడానికి రోజూ వాష్ బేసిన్ లో నీరుపోయే చోట నిమ్మకాయ లేదా కమలాపండు దబ్బలు వేస్తే దుర్వాసన పోయి వాష్ బేసిన్ సువాసనలు చిందిస్తుంది.

 ఫర్నీచర్ పై ఏర్పడ్డ మచ్చలను, మురికిని, గీతలను పోగొట్టడంలో అరటిపండు తొక్కలు బాగా పనిచేస్తాయి.

 వెదురు వస్తువుల పైన ఏర్పడ్డ గీతలు, గంట్లు పోవడానికి కొద్దిగా ఆలివ్ ఆయిల్, వెనిగర్ ఉంటే చాలు. ఈ రెండింటినీ సమపాళ్లల్లో తీసుకుని ఆ మిశ్రమంతో వెదురు వస్తువులపై ఏర్పడ్డ గంట్లు, పగుళ్లు, గీతలు ఏర్పడ్డ చోట రుద్దితే చాలు అవి పోతాయి.

 ఇంట్లో కిటికీలు, తలుపుల అద్దాలను మిల మిల మెరిసేలా చేయడానికి ఒక ట్రిక్కు ఉంది. అదేమిటంటే నాలుగు లీటర్ల గోరువెచ్చని నీటిలో 100 ఎంఎల్ వైట్ వెనిగర్, ఒక టీస్పూను డిష్ వాషింగ్ ఫ్లూయిడ్ వేసి మూడింటినీ బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ఒక క్యాన్ లో పోసుకోవాలి. ఆ మిశ్రమాన్ని చిన్న ప్లాస్టిక్ బాటిల్ లో పోసుకుని గ్లాసుల మీద చల్లి తుడిస్తే అవి తళ తళ మెరుస్తాయి. ఇది గ్లాస్ క్లీనర్ గా అద్భుతంగా పనిచేస్తుంది.

 నల్లబడిన, మెరుపు తగ్గిన వెండి వస్తువులను టూత్ పేస్టుతో శుభ్రం చేస్తే మిల మిల మెరిసిపోతాయి.

 ఎంత మన్నికైన వస్త్రాలైనా సరే నార్మల్ వాషింగ్ మెషీన్ లో వేసినా మురికి పూర్తిగా పోవు. అలాగే వాటికి అంటిన చెమట వాసనలు కూడా పోవు. వీటిని అంటిపెట్టుకున్న సూక్ష్మక్రిములు, చెమటవాసన పోవాలంటే ప్యాంట్లు, డ్రస్సులు, చొక్కాలను జిప్ లాక్ కవర్ లో పెట్టి ఒకరోజంతా కూలర్ లో ఉంచి ఆమర్నాడు బయట పెట్టాలి. దీంతో బాగా ఫ్రీజ్ అయిన ఆ దుస్తులు డీఫ్రీజ్ అయి మురికి పూర్తిగా పోయి శుభ్రంగా ఉంటాయి.

 డెంచర్ ట్యాబ్స్ తో అంటే డెంటల్ రిప్లేస్ మెంట్ టాబ్లెట్స్ తో టాయ్లెలెట్ పిట్స్ పై ఏర్పడ్డ మరకలను పోగొట్టవచ్చు. మనం చేయాల్సిందల్లా శుభ్రం చేయాల్సిన టాయ్ లెట్ పిట్ లో ఈ డెంటల్ రిప్లేస్ మెంట్ టాబ్లెట్ వేసి అరగంట తర్వాత బ్రెష్ తో పిట్ ను శుభ్రం చేస్తే చాలు దానిపై ఉన్న మరకలు పోతాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News