Sunday, November 24, 2024
Homeహెల్త్Do not put them in Fridge: మీ ఫ్రిజ్ లో ఇవేవీ స్టోర్ చేయకండి

Do not put them in Fridge: మీ ఫ్రిజ్ లో ఇవేవీ స్టోర్ చేయకండి

 ఫ్రిజ్ లోని చల్లదనానికి తేనె గడ్డకట్టుకుంటుంది. దాంతో తేనెలోని చక్కెర పదార్థం ఉండలుండలుగా అవుతుంది.

- Advertisement -

 ఫ్రిజ్ లోని చల్లదనం వల్ల బ్రెడ్ లోని పిండిపదార్థాలు చక్కెరగా మారి బ్రెడ్డు సహజరుచిని కోల్పోతుంది.

 అరటి పళ్లు పొడి వాతావరణంలో మగ్గుతాయి కాబట్టి వాటిని ఫ్రిజ్ లో పెట్టకూడదు.

 కేక్ పై క్రీము ఉంటే ఫ్రిజ్ లో పెట్టొచ్చు తప్ప లేకపోతే పొడివాతావరణంలో దాన్ని ఉంచితేనే రుచిగా ఉంటుంది. గాలి చొరబడని కంటైనర్ లో కేక్ పెట్టి బయటే దాన్ని పెట్టొచ్చు.

 కీరకాయలను ఫ్రిజ్ లో పెడితే లోపలి చల్లదనానికి మెత్తబడిపోతాయి. బయటకు తీసి వాటిని కోసిన వెంటనే వాటిల్లో ఉండే నీరు కారిపోతుంది. అందుకే కీరకాయలను గది ఉష్ణోగ్రతలోనే ఉంచాలి.

 టొమాటోలను కూడా గది ఉష్ణోగ్రతలోనే ఉంచాలి. ఫ్రిజ్ లో పెడితే వాటి పైన ఉండే పలచటి పొర దెబ్బతింటుంది.

 వెల్లుల్లిని ఫ్రిజ్ లో పెడితే ఆ చల్లదనానికి అవి పాడైపోతాయి. వాటిని బయట ఉంచితేనే ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి.

 ఆలూను కూడా ఫ్రిజ్ లో పెట్టకూడదు. ఫ్రిజ్ లోని తేమ వల్ల ఆలూలోని పిండి పదార్థాలు చక్కెరగా మారి రుచి ఉండవు. ఆలూ రంగు కూడా మారుతుంది. అందుకే వీటిని బయటే వెలుగు సోకని ప్రదేశంలో భద్రపరచాలి.

 నట్స్ ను , ఖర్జూరాల్లాంటివాటిని ఫ్రిజ్ లో పెడితే వాటి రుచి పోతాయి. అలా కాకుండా వాటిని గాలిచొరబడని గాజు సీసాల్లో పెట్టి ఫ్రిజ్ లో భద్రపరిస్తే తాజాగా ఉంటాయి. బయట వేడి తక్కువగా ఉన్న చోట నట్స్ ను డబ్బాలో వేసి ఉంచితే పాడవవు. రుచిని కోల్పోవు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News