Thursday, April 18, 2024
Homeహెల్త్Fennel seeds: సోంపుతో అందం

Fennel seeds: సోంపుతో అందం

అందం ఆరోగ్యానికి ..

సోంపుతో సుందరంగా…

- Advertisement -

సోంపు గింజలు గురించి తెలియనివారుండరు. ఇవి నోట్లో వేసుకుంటే వచ్చే సువాసన, రుచి నచ్చని వారు కూడా ఉండరు. ముఖ్యంగా సోంపు గింజలు నోటిని పరిశుభ్రంగా ఉంచుతాయి. నోటి దుర్వాసనను నివారిస్తాయి. మధుమేహ వ్యాధిపై పోరాడతాయి. అంతేకాదు కొలస్ట్రాల్ ప్రమాణాలను సమతుల్యం చేస్తాయి. యాంటిబయొటిక్స్ వాడే వారు, బ్లడ్ థిన్నర్స్ ఉపయోగించేవారు, సోంపు గింజలు పడని వారు తప్ప అందరూ సోంపును ఆస్వాదించవచ్చు. రోజుకు ఒక టీస్పూను సోంపులు తింటే చాలు. ఇక వీటివల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాలు కోకొల్లలు. ఇవి జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. ఆస్తమా, శ్వాసకోశ వ్యాధుల నుంచి సాంత్వననిస్తాయి. ఇక తల్లిపాలు ఇచ్చే అమ్మలు వీటి వల్ల పొందే లాభాలు ఎన్నో. తల్లుల్లో పాలు ఎక్కువగా వచ్చేలా ఈ గింజలు చేస్తాయి. నోటి దుర్వాసన పోగొడతాయి. మధుమేహాన్ని నియంత్రిస్తాయి. రొమ్ములు పెరగడానికి కూడా సోంపు తోడ్పడుతుంది. శరీరంలోని కొవ్వు ప్రమాణాలను తక్కువ చేస్తాయి.

ఎడెమాను తగ్గించడంలో సహాయపడుతుంది. సంతాన సాఫల్యానికి కూడా ఈ గింజలు ఎంతగానో తోడ్పడతాయి. రక్తపోటు ప్రమాణాలను సైతం ఇవి క్రమబద్ధీకరిస్తాయి. బరువు తగ్గడానికి ఈ గింజలు ఎంతో
సహాయకారిగా ఉంటాయి. కారణం ఈ గింజల్లో పీచుపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెటబాలిజం బాగా పనిచేసేలా సహాయపడతాయి. ఇవి తినడం వల్ల తొందరగా ఆకలి వేయదు. శరీరంలోని అదనపు ద్రవాలను సైతం ఇవి బయటకు పంపేస్తాయి. మంచి నిద్ర పట్టేట్టు చేస్తాయి. ముఖ్యంగా సోంపు గింజలు జుట్టు, చర్మానికి అందించే లాభాలైతే ఎన్నో. స్కిన్ కేర్ ఉత్పత్తుల్లో సోంపు నుంచి తీసిన పదార్థాలను వాడడం గమనించవచ్చు. ఇవి చర్మాన్ని ఫ్రీరాడికల్స్ నుంచి సంరక్షిస్తాయి. చర్మ కణాలు ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సోంపు గింజలు ఎంతో ప్రత్యేకమైనవని చెప్పాలి.


చర్మం అందాన్ని సోంపు గింజల స్టీమ్ ఫేషియల్ పెంచుతుంది. ఇది చర్మానికి ఇచ్చే నిగారింపు ఎంతో. దీనితో చర్మం టోనింగ్ బాగుండడమే కాదు స్కిన్ ఎప్పుడూ ఎంతో తాజాగా ఉంటుంది. సోంపు గింజల్లో మెగ్నీషియం ఉంటుంది. అందుకే ఇవి మనకు ఎంతో నాణ్యమైన నిద్రను ఇస్తాయి. ముఖ్యంగా పెద్దవాళ్లకు ఇవి చేసే మేలు ఎంతో. ఇస్నోమ్నియా లాంటి స్లీప్ డిజర్డర్లకు చికిత్సనందించడంలో కూడా సోంపు గింజలు కీలకంగా వ్యవహరిస్తాయి. చర్మం టోన్ ను ఇవి మెరుగుపరుస్తాయి. ఇందుకు గాను ఒక గుప్పెడు సోంపు గింజలు తీసుకుని వాటిని మరిగే నీళ్లల్లో వేయాలి. ఆ నీళ్లు చల్లారిన తర్వాత అందులో ఫెన్నల్ ఎసెన్షియల్ ఆయిల్ చుక్కలు కొన్ని వేసి బాగా కలపాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని ఫిల్టర్ చేయాలి. కాటన్ బాల్స్ తీసుకుని ఫిల్టర్ చేసిన ఆ నీటిలో ముంచి ముఖానికి అద్దుకోవాలి. ఇలా రోజులో వీలనన్ని సార్లు చేయాలి. దీంతో చర్మం టోనింగ్ బాగా అవడమే కాదు రోజంతా స్కిన్ తాజాదనంతో మెరిసిపోతుంది.

ఫెన్నల్ సీడ్ ఫేషియల్ కూడా ముఖాన్ని ఎంతగానో కాంతివంతం చేస్తుంది. అరకప్పు నీటిలో టేబుల్ స్పూన్ సోంపు గింజలు వేయాలి. అరగంట తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఓట్మీల్, తేనె దాంట్లో కలపాలి. ఆ
మిశ్రమాన్ని మెత్తటి పేస్టులా చేయాలి. ఆ పేస్టును ముఖానికి రాసుకుని 20 నిమిషాలు అలాగే వదిలేయాలి. ఆతర్వాత గోరువెచ్చటి నీటితో ముఖం శుభ్రంగా కడుక్కోవాలి.

సోంపు గింజలు శిరోజాల ఆరోగ్యాన్ని, అందాలను పరిరక్షిస్తాయి. ఈ గింజల్లో యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉండడంతో పాటు వీటిల్లో యాంటిమైక్రోబియల్ ఎఫెక్ట్స్ కూడా బాగా ఉంటాయి. ఇవి జుట్టుకు సంబంధించిన పలు అనారోగ్య సమస్యలను పరిష్కరిస్తాయి. ఈ గింజలు చుండ్రును తగ్గిస్తాయి. మాడుపై తలెత్తే దురద, ఇరిటేషన్లను తగ్గిస్తాయి. జుట్టు చిట్లకుండా కాపాడతాయి. వెంట్రుకలు రాలకుండా సహాయపడతాయి. జుట్టు రాలకుండా ఉండాలంటే సోంపు గింజలు ఎలా వినియోగించాలంటారా? చాలా సింపుల్. మొదట సోంపు టీ ని తయారుచేయాలి. మూడు టేబుల్ స్పూన్ల సోంపు గింజలు తీసుకోవాలి. లేదా సోంపు గింజల పొడిని కూడా ఇందులో వాడొచ్చు. ఆ రెండు కప్పుల నీటిని బాగా మరిగించి మెత్తగా చేసిన సోంపు గింజల పొడిని అందులో వేయాలి. ఆ సొల్యూషన్ ను 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. మీ తలకు షాంపు, కండిషనర్లు పెట్టుకున్న తర్వాత సోంపు పొడి నీటితో శిరోజాలను శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టు ఎంతో ఆరోగ్యంగా ఉండడమే కాకుండా జుట్టు చిట్లకుండా, శిరోజాలు రాలిపోకుండా కూడా సోంపు గింజలు కాపాడతాయి.

జుట్టు అందంగా ఆరోగ్యంగా ఉండడానికి సోంపుగింజలు, వెనిగర్ సొల్యూషన్ కూడా బాగా పనిచ్తేఉంది. యాపిల్ సిడార్ వెనిగర్, గ్లిజరిన్, సోంపు గింజలు మూడు కలిపి సొల్యూషన్ లా చేయాలి. దీన్ని దురదగా, పొడారిపోయినట్టు ఉన్న మాడు భాగంలో అప్లై చేయాలి. ఇందుకుగాను ఒక కప్పు నీటిని తీసుకుని బాగా మరిగించాలి. బాగా మెత్తగా చేసిన ఒక స్పూను సోంపు గింజల పొడిని అందులో వేయాలి. దాన్ని అరగంట సేపు అలాగే ఉంచాలి. దానికి ఒక స్పూను వెజిటబుల్ గ్జిరిన్, యాపిల్ సిడార్ వెనిగర్ లను జోడించాలి. ఆ సొల్యూషన్ ను చీజ్ క్లాత్ తో వొడగొట్టాలి. ఆ మిశ్రమంతో మాడును బాగా మసాజ్ చేసుకోవాలి. శిరోజాలకు కూడా దాన్ని పట్టించి బాగా మసాజ్ చేయాలి. తర్వాత కొద్దిసేపు వెంట్రుకలను అలాగే వదిలేయాలి. ఇలా
తయారుచేసుకున్న టానిక్ ను వారం రోజులు భద్రం చేసుకోవచ్చు కూడా.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News