Sunday, September 8, 2024
Homeహెల్త్For Silky skin: చర్మం అందంగా..ఆరోగ్యంగా

For Silky skin: చర్మం అందంగా..ఆరోగ్యంగా

ముఖానికి నిత్యం మనం తీసుకునే జాగ్రత్తలు అరచేతుల సంరక్షణ విషయంలో తీసుకోము. అరచేతులను ఆరోగ్యంగా ఉంచుకోవాలని, వాటికి కూడా మాయిశ్చరైజర్స్ అవసరమని చాలామంది గమనించరు. పట్టించుకోరు కూడా. అరచేతుల్లోని చర్మానికి తగినంత తేమ అందేలా జాగ్రత్త పడటంతో పాటు అవి ఆరోగ్యంతో మెరిసేలా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని సౌందర్య నిపుణులు చెపుతున్నారు. అందుకు కొన్ని టిప్స్ కూడా ఉన్నాయంటున్నారు. అవి…

- Advertisement -

 అరచేతుల చర్మంపై చెమట గ్రంధులు కొన్ని ఉంటాయి. ఇవి చర్మన్ని తొందరగా పొడారిపోయేట్టు చేస్తాయి. అంతేకాదు అర చేతులను మనం తరచూ కడుక్కుంటుంటాం. హ్యాండ్ వాష్ తో శుభ్రం చేసుకుంటుంటాం. ఇలా చేయడంవల్ల కూడా అరచేతుల్లోని చర్మానికి ఉండే సహజసిద్ధమైన తేమగుణం పోతుంది. అయితే తరచూ చేతులు కడుక్కోవడం మంచిదే కానీ చేతులు కడుక్కున్న తర్వాత అరచేతుల్లోని తేమ పోకుండా మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ముఖాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ ఎలా రాసుకుంటామో అరచేతులకు కూడా మాయిశ్చరైజర్ ను తప్పనిసరిగా రాసుకోవాలని గుర్తుంచుకోవాలి. చేతులను శుభ్రంగా కడుక్కుని తువ్వాలుతో తుడుచుకున్న తర్వాత అరచేతులకు మాయిశ్చరైజర్ ని పట్టించాలి. అలా చేయకపోతే అరచేతిలోని చర్మం పొట్టులా ఊడిపోవడమే కాదు దురదతో పాటు, చర్మం ఎండినట్టు అవుతుంది. అక్కడి చర్మం కాంతివిహీనంగా తయారవుతుంది.

 చేతులు మన వయసును ఇట్టే పట్టిస్తాయి. అందుకే హైడ్రేటింగ్ హ్యాండ్ క్రీము చేతులకు రాసుకుంటే అరచేతుల్లోని చర్మంలో తేమ ప్రమాణాలు పెరుగుతాయి. అక్కడి చర్మం ఎలాస్టిసిటీ పెరుగుతుంది. అరచేతి చర్మం తొందరగా ముడతలు పడదు.

 హ్యాండ్ క్రీము వాడడం వల్ల అరచేతులతో పాటు వేళ్ల చిగుళ్లకు కూడా చాలా మంచిది. వేళ్ల చిగుళ్లు సురక్షితంగా, కాంతివంతంగా తయారవుతాయి.

 అరచేతుల్లో ప్రషర్ పాయింట్స్ ఉంటాయి. చేతులకు హ్యాండ్ క్రీము రాసుకుని మసాజ్ చేసుకుంటే ప్రెషర్ పాయింట్స్ లో ఉండే నరాలు వదులవడమే కాదు అక్కడ కేంద్రీక్రుతమైన ఒత్తిడి పోయి నరాలకు ఎంతో సాంత్వన లభిస్తుంది.

 ఆల్కహాల్ తో తయారుచేసిన హ్యాండ్ వాష్ తో కాకుండా ఆర్గానిక్ హ్యాండ్ వాష్ తో అరచేతులను శుభ్రం చేసుకుంటే మంచి ఫలితాలు చూస్తారు. ప్రొబయొటిక్ పామ్ బామ్స్ వల్ల అరచేతులకు కావలసినంత సాంత్వన లభిస్తుంది. చేతివేళ్ల చిగుళ్లు నొప్పి పెట్టకుండా ఇవి సాంత్వన నిస్తాయి. అలాగే గోళ్ల సంరక్షణ విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల బాక్టీరియా బారిన చేతులు పడవు. అరచేతులు ట్యాన్ బారిన పడకుండా చేసే పలు హ్యాండ్ క్రీము ఫార్ములేషన్లు, ఉత్పత్తులు మార్కెట్లో ఎన్నో ఉన్నాయి.

 నాణ్యమైన మాయిశ్చరైజర్ లేదా లోషన్ ని రోజులో చాలాసార్లు చేతులకు రాసుకుంటుండాలి. ఇలా చేస్తే చేతులు మ్రుదువుగా, అందంగా కనిపిస్తాయి.

 ఎక్కువసేపు నీళ్ల ల్లో పని చేయాల్సి వస్తే చేతులకు గ్లోవ్స్ వేసుకుంటే మంచిది. గ్లోవ్స్ వేసుకుంటే నీళ్ల వల్ల అరచేతి చర్మంలో ఉన్న సహజసిద్ధమైన ఆయిల్స్ పోకుండా ఉంటాయి.

 ఎగ్జిమా ఉంటే అది ఒత్తిడి కారణంగా మరింత పెరిగే అవకాశం ఉంది. దీన్ని అడ్డుకునేందుకు హ్యాండ్ లోషన్స్ స్ట్రెస్ బస్టర్స్ గా అరచేతులపై ఉండే చర్మంపై పనిచేస్తాయి.

 అరచేతులు మ్రుదువుగా ఉండాలంటే మీరు వాడే మాయిశ్చరైజర్లల్లో గ్లిజరిన్, జొజాబా ఆయిల్, షియా బటర్, లేదా అలొవిరా వంటి పదార్థాలు ఉండేలా చూసుకోవాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News