Monday, June 23, 2025
Homeహెల్త్Lemon juice for health: మీకు ఆ సమస్య ఉందా..? అయితే నిమ్మరసాన్ని వదిలేయండి..!

Lemon juice for health: మీకు ఆ సమస్య ఉందా..? అయితే నిమ్మరసాన్ని వదిలేయండి..!

Medical professionals on Lemon water: ఈ మధ్య ఉదయం నిద్రలేవగానే మంచి నీళ్లు లేదా నిమ్మరసం తాగడం చాలామందికి ఒక అలవాటుగా మారింది. ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగిన ఈ రోజుల్లో, చాలా మంది తమ దైనందిన అలవాట్లలో మార్పులు చేసుకుంటున్నారు. ముఖ్యంగా కోవిడ్-19 మహమ్మారి తర్వాత ప్రజలు ఆరోగ్యంపై మరింత దృష్టి సారించి, తమ జీవనశైలిని మార్చుకున్నారు. నిమ్మరసం తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, రోగనిరోధక శక్తి పెరుగుతుందని చాలా మంది నమ్ముతారు.
అయితే ఈ నిమ్మరసం ఆరోగ్యానికి మంచిదేనా? ఎవరు తాగాలి, ఎవరు తాగకూడదు? నిమ్మరసం ప్రయోజనాలు, ఏ పరిస్థితుల్లో దాన్ని తీసుకోకూడదు అనే అంశంపై నిపుణులు ఏం చెబుతున్నారు? అనేది ఇప్పుడు చూద్దాం.

- Advertisement -

నిమ్మరసం ప్రయోజనాలు:

నిమ్మరసం మన శరీరానికి అవసరమైన విటమిన్ సి ని పుష్కలంగా అందిస్తుంది. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌ గా ఉంచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా నిమ్మరసం ఎంతో మేలు చేస్తుంది.

నిమ్మరసం ఎవరికి మంచిది కాదు?

అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ, నిమ్మరసం కొందరిలో అనారోగ్య సమస్యలను తీసుకొస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎసిడిటీ సమస్యలు ఉన్నవారు:

ఎసిడిటీతో బాధపడేవారు నిమ్మరసం తాగడం మానుకోవాలి. నిమ్మరసం తాగడం వల్ల గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లెక్స్, కడుపునొప్పి వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

పంటి ఎనామిల్ బలహీనంగా ఉన్నవారు:

నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ పళ్లపై ఉండే ఎనామిల్‌ను బలహీనపరుస్తుంది. ఎనామిల్ బలహీనంగా ఉన్నవారు నిమ్మరసం తరచుగా తాగడం వల్ల దంత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

కిడ్నీ సమస్యలు ఉన్నవారు:

కిడ్నీ సమస్యలతో బాధపడేవారు నిమ్మరసానికి దూరంగా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగడం వల్ల కిడ్నీకి సంబంధించిన సమస్యలు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. కిడ్నీలో రాళ్లు లేదా ఇతర కిడ్నీ సమస్యలు ఉన్నవారు నిమ్మరసాన్ని తీసుకోకపోవడమే మంచిది.

కీళ్ల నొప్పులు ఉన్నవారు:

తరచుగా కీళ్ల నొప్పులతో బాధపడేవారు నిమ్మరసం తాగకూడదని చెబుతారు. నిమ్మకాయల్లో ఉండే యాసిడ్ ఎముకల్లోని కాల్షియంను తగ్గించి, ఎముకలను బలహీనపరుస్తుంది. కాబట్టి, ఇటువంటి సమస్యలతో బాధపడుతుంటే నిమ్మరసం తాగకపోవడమే మేలు.

మీరు ఏ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నా, నిమ్మరసం తాగడం ప్రారంభించే ముందు వైద్యుడిని లేదా ఆరోగ్య నిపుణుడిని సంప్రదించడం ఎల్లప్పుడూ మంచిది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News