Monday, November 4, 2024
Homeహెల్త్Obesity: సైజ్ జీరోకు ఈ నీళ్లు భలే పనిచేస్తాయి

Obesity: సైజ్ జీరోకు ఈ నీళ్లు భలే పనిచేస్తాయి

సన్నబడాలంటే ఆరోగ్యంగా, క్రమంగా సన్నబడండి

బరువు తగ్గించే బార్లీ నీళ్లు

- Advertisement -

లావుగా ఉన్నారా? బరువు తగ్గాలనుకుంటున్నారా? ఇందుకు మీ వంటింట్లోనే మంచి ప్రత్యామ్నాయం ఉంది. బార్లీ గింజలు ఈ పని బాగా చేస్తాయి. వీటిల్లోని పీచుపదార్థాలు మీ బరువును తగ్గించడంలో ఎంతో
బాగా పనిచేస్తాయి. ఈ విషయంలో బార్లీ నీళ్లు మంచి స్టిమ్యులేటర్ గా పనిచేస్తాయి. ఇందులోని పీచుపదార్థాల వల్ల దీన్ని తీసుకున్న వాళ్లకు ఆకలి తొందరగా వేయదు. కడుపు నిండుగా ఉంటుంది.
శరీరబరువును తగ్గించే ఎన్నో పోషకాలు ఒక గ్లాసుడు బార్లీ నీళ్లల్లో ఉన్నాయి. బార్లీ శరీరంలోని కొలెస్ట్రాల్ ప్రమాణాలను తగ్గిస్తుంది కూడా.


ఇందులోని బేటా గ్లుకాన్ అనే పదార్థంలో పీచును కరిగించే గుణాలు బాగా ఉన్నాయి. నిత్యం బార్లీని ఉపయోగించడం వల్ల శరీరంలోని విషపదార్థాలు మూత్రనాళం నుంచి బయటకు పోతాయి. అంతేకాదు
మూత్రనాళంలో తలెత్తే ఇన్ఫెక్షన్లను నివారించడంలో కూడా బార్లీ నీళ్లు ఎంతో శక్తివంతంగా పనిచేస్తాయి. కిడ్నీలో రాళ్లను కూడా బార్లీ కరిగిస్తుంది. బార్లీ గింజల్లోని గ్లైసెమిక్స్ ఇండెక్స్ గుణాల వల్ల బ్లడ్ షుగర్ ప్రమాణాలను క్రమబద్ధీకరించడం ద్వారా శరీర బరువును తగ్గించడంలో బార్లీ బాగా తోడ్పడుతుంది. శరీరాన్ని డిటాక్సిఫై చేయడమే కాకుండా మలినాలను బయటకు పోగొట్టడం ద్వారా జీర్ణాశయాన్ని బాగా శుభ్రం చేస్తుంది. మీ శరీరాన్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచుతుంది.

బార్లీ నీళ్లు తాగడం వల్ల అందులోని పీచు పదార్థాలతో కడుపు నిండుగా ఉండి ఆకలి తొందరగా వేయదు. అలా బరవును తగ్గించడంలో బార్లీ నీళ్లు బాగా పనిచేస్తాయి. దీంతో జంక్ ఫుడ్ జోలికి పోరు. బార్లీ గ్రాస్ జ్యూసు తాగడం వల్ల కూడా వెయిట్ లాస్ అవుతారు. నీళ్ల వల్ల జీర్ణక్రియ కూడా బాగా జరుగుతుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటే అనారోగ్య సమస్యలు చాలా తగ్గుతాయి. అందుకే ఆయుర్వేద వైద్యంలో బార్లీ నీళ్లను ఒక టానిక్ గా పేర్కొంటారు. అంతేకాదు మలబద్దకం, డయేరియా వంటి జీర్ణ సంబంధ సమస్యలను కూడా బార్లీ నీళ్లు తగ్గిస్తాయి.

బార్లీ గింజలను నీళ్లల్లో నానబెట్టి ఆ నీళ్లను వడగట్టి తాగితే శరీరంలోని కాలరీలు బాగా తగ్గుతాయి. అలాగే ముందే చెప్పినట్టు బార్లీ గింజల్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి.ఇందులో ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. బార్లీలోని ఐరన్ శరీరంలోని రక్తాన్ని వృద్ధిచేసి అలసట, బద్ధకం, ఏకాగ్రత లేకపోవడం వంటి శరీరక సమస్యలను సైతం తగ్గిస్తుంది. ఇక బార్లీలోని యాంటాక్సిడెంట్లు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను దృఢం చేస్తాయి. జలుబు, దగ్గు, జ్వరం వంటి వాటికి లోనుకాకుండా నియంత్రిస్తాయి. బార్లీ గింజలు రక్తపోటును కూడా బాగా నియంత్రిస్తాయి. శరీరంలోని రక్తకణాల వృద్ధికే కాకుండా మూత్రపిండాలు ఆరోగ్యంగా పనిచేసేలా చేయడంలో కూడా బార్లీ గింజలు ఎంతో శక్తివంతమైనవి. ఆరోగ్యకరమైన శరీరం ఉంటే ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉంటాం. ఒక్కమాటలో చెప్పాలంటే బార్లీ జీరో కాలరీ, జీరో కొలెస్ట్రాల్ ఫుడ్. మరి ఎందుకు ఆలస్యం శరీరారోగ్యానికి అంత మంచి చేసే బార్లీ గింజల వినియోగాన్ని మీ డైలీ డైట్ మెనూలో చేర్చండి…స్లిమ్ గా…మరింత ఆరోగ్యంగా అయిపోండి…

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News