Friday, September 20, 2024
Homeహెల్త్palak paneer: మీ ఫేవరెట్ డిష్ హెల్తీ కాదు, న్యూట్రిషనిస్టు మాట వినండి

palak paneer: మీ ఫేవరెట్ డిష్ హెల్తీ కాదు, న్యూట్రిషనిస్టు మాట వినండి

చిన్నా, పెద్దా అందరికీ పాలక్ పనీర్ అంటే చాలా ఫేవరెట్ డిష్. అయితే ఆరోగ్యపరంగానూ ఇది చాలా మంచి వంటకం. కానీ మీ ఫేవరెట్ పాలక్ పనీర్ ఏమంత హెల్తియస్ట్ డిష్ కాదంటున్నారు న్యూట్రిషనిస్టులు. ఇప్పటికే దీనిమీద చాలా హెచ్చరికలు వచ్చినా పాలక్ పనీర్ ఫేవరెట్స్ న్యూట్రిషనిస్టులు చెప్పే మాట వినిపించుకోవటం లేదు. వింటర్ డిష్ గా, డాబా-రెస్టారెంట్ వెళ్లగానే ఫస్ట్ ఛాయిస్ గా మనలో చాలా మంది ఆర్డర్ చేసే పాలక్ పనీర్ కాంబోలో రోటీ, రైస్ తినటం అలవాటుగా మారితే మీరు పనీర్ వేరే డిష్ గా, పాలక్ డిష్ వేరేగా ఆర్డర్ చేసుకోండంటున్నారు న్యూట్రిషనిస్టులు. రైట్ కాంబినేషన్ తింటేనే ఆరోగ్యానికి మంచిదని, హెల్తీ ఈటింగ్ అంటే రైట్ కాంబో కూడా అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని వీరంటున్నారు. స్పినాచ్ అంటే ఎంత ఐరన్ రిచ్ ఆకుకూరనో మనందరికీ తెలుసు. పనీర్ అంటే క్యాల్షియం రిచ్ ఫుడ్. కానీ ఈరెంటినీ కలిపినప్పుడు ఐరన్ అబ్సార్పషన్ జరక్క న్యూట్రిషన్ ఎలిమెంట్స్ మిస్ అవుతాయి. అందుకే పాలకూరతో పనీర్ కాంబినేషన్ కాకుండా ఇందులోకి ఆలూ, కార్న్ వంటివి జతచేయటం మరింత మంచిదని సెలబ్రిటీ న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. ఇలా చేస్తే పాలకూరలోని పోషకాలు మన ఒంట్లోకి చేరతాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News