Sunday, September 8, 2024
Homeహెల్త్Super food gifted by Lord Ram: రాముడిచ్చిన ధాన్యమట! అందుకే సూపర్ ఫుడ్

Super food gifted by Lord Ram: రాముడిచ్చిన ధాన్యమట! అందుకే సూపర్ ఫుడ్

అమరాంత్ గురించి విన్నారా? సూపర్ ఫుడ్ గా పలుదేశాల్లో దీని పేరు నేడు మారుమోగిపోతోంది. దీనిని మనదేశంలో రాజ్ గిర లేదా రామ్ దానా అంటారు. రాజ్ గిర అంటే రాయల్ గ్రైయిన్ అని అర్థం. మనదేశంలో దేవుడిగా మనమంతా పూజించే రాముడు ఇచ్చిన ధాన్యంగా దీన్ని చెప్తారు.

- Advertisement -

అమరాంత్ అంటే ఎన్నటికీ వాడిపోనిదని అర్థం. శాశ్వతమైనదని అర్థం. ఎంతో పురాతనమైన ఈ అమరాంత్ సూపర్ ఫుడ్ గా ఖ్యాతి పొందింది. దీనివల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాలు ఎంతో అద్భుతమైనవి. ఇందులో పీచుపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఇది గ్లూటన్ ఫ్రీ కూడా. మరో విషయం ఏమిటంటే ఇది ప్రొటీన్ల నిధి. ఇందులో ఉండే పోషకాలు ఎంతో విశేషమైనవి. కాలంతో కనుమరుగైన అమరాంత్ సూపర్ ఫుడ్ గా నేడు ఎన్నో ఇళ్లల్లో వంటింటి రాణిగా ఘుమఘుమలను చిందిస్తోంది. ఆరోగ్య నిధిగా ప్రశంసలను అందుకుంటోంది.


అమరాంత్ ని చులాయ్ అని కూడా పిలుస్తారు. వాడని పుష్పంగా పేర్కొనే దీని ఆకులు, గింజలు ప్రొటీన్లతో నిండివుండడమే కాదు సూక్ష్మపోషకాలకు ఇది నెలవు. బరువు తగ్గాలనుకునే వాళ్లు, బ్లడ్ షుగర్ ని నియంత్రణలో పెట్టాలనుకునే వాళ్లు నిత్యం తమ డైట్ లో అమరాంత్ ని చేరిస్తే మంచి ఫలితాలు పొందగలరు. అమరాంత్ మూలాలు మెక్సికో, సెంట్రల్ అమెరికాల్లో ఉన్నట్టు చెప్తారు. మనదేశంలో దీన్ని ప్రధానంగా కొండప్రాంతాల్లో పండిస్తారు. అయితే గత కొద్ది దశాబ్దాల నుంచి దీన్ని మధ్య, పశ్చిమ మైదాన ప్రాంతాల్లో కూడా పండిస్తున్నారు. అమెరికాలో సైతం అమరాంత్ పేరు మారుమోగిపోతోంది. ఇందుకు కారణం ఈ సూపర్ ఫుడ్ లో ఉన్న ప్రత్యేకతలే. సిలియాక్ జబ్బు ఉన్నవారు అంటే గ్లూటెన్ ఇంటాలరెన్స్ ఉన్న వారికి ఇది మంచి ఫుడ్ ఛాయస్ అట. దీని ఆకులతో రుచికరమైన కూర వండుకోవచ్చు.

అమరాంత్ గింజలను ధాన్యంగా ఉపయోగిస్తారు. వీటితో రోటీ చేసుకోవచ్చు. లడ్డూలు చేసుకోవచ్చు. సూప్ కూడా చేసుకోవచ్చు. ఇందులో ప్లాంట్ ప్రొటీన్లు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు ఇది ఎంతో సులభంగా కూడా జీర్ణమవుతుంది. ఇది శరీరానికి అత్యవసర ప్రొటీన్లను కూడా అందిస్తుంది. పలు స్టడీల్లో తేలినదాన్ని బట్టి అమరాంత్ లో అన్ని రకాల అమినోయాసిడ్లు ఉన్నాయి. ఇందులో లభించే ప్రొటీన్లు యానిమల్ ప్రొటీన్లతో సమానమైన శక్తినిస్తాయిట. అందుకే శాకాహారులకు ఈ ప్రొటీన్ ఫుడ్ ను తినవలసిందిగా పోషకాహార నిపుణులు ప్రత్యేకంగా సూచిస్తున్నారు కూడా. ఇందులో డైటరీ ఫైబర్ అధికంగా ఉంది. అమరాంత్ ఆకులు, గింజల్లోని పోషకాలు శరీరానికి కావలసినంత ఎనర్జీని అందిస్తాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News