Sunday, November 16, 2025
Homeహెల్త్Cardamom Tea: యాలకుల టీ తాగుతున్నారా..? నిపుణులు ఏం చెప్తున్నారంటే..

Cardamom Tea: యాలకుల టీ తాగుతున్నారా..? నిపుణులు ఏం చెప్తున్నారంటే..

Benefits of Cardamom Tea: చాలా మందికి టీ తాగడం ప్రియమైన అలవాటు. నచ్చిన పని చేయాలన్నా.. చేస్తున్న పనిలో ఉత్సహాంగా ఉండాలన్నా..ఒక్క టీ అయినా తాగుతుంటారు. ఇటీవల టీ ఒక్కటే కాకుండా దానికి అనేక రకరాల సుగంద ద్రవ్యాలను యాడ్ చేసుకుని తాగుతున్నారు. అయితే, టీ కి యాలకులు జోడించి తాగితే దాని రుచి అమోఘం. వీటిని టీ లో జోడించడం వల్ల రుచిని పెంచడమే కాకుండా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మరి, అవేంటో ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

- Advertisement -

రుచి, సువాసన
టీలో యాలకులు యాడ్ చేయడం వల్ల తక్షణ ప్రభావాల్లో రుచి ఒకటని నిపుణులు చెబుతున్నారు. ఇవి టీలో తీపి, పూల రుచిని నింపుతాయని..దాల్చిన చెక్క, అల్లం, లవంగాలు వంటివి ఘాటును కలిగిస్తాయని నిపుణులు పేర్కొన్నారు.

రోగనిరోధక శక్తి
యాలకుల టీ లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయని, ఇవి రోగనిరోధక శక్తిని వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. టీలో యాలకులను జోడించడం ద్వారా శరీరానికి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుందని, అంతేకాకుండా..దీర్ఘకాలిక వ్యాధులతో ముడిపడి ఉన్న ఫ్రీ రాడికల్స్​తో పోరాడటానికి సహాయపడుతుందంటున్నారు.

 

Also Read: iPhone 16: కేక పెట్టించే ఆఫర్.. కేవలం రూ.50 వేలకే ఐఫోన్‌ 16

జీర్ణక్రియ
యాలకుల టీ జీర్ణ ఎంజైమ్​ల ఉత్పత్తిని ప్రేరేపించడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ టీ తాగడం వల్ల కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, అజీర్తి వంటి సమస్యలను తగ్గిస్తుందని పేర్కొన్నారు. అంతేకాకుండా యాలకులు జీర్ణ వ్యవస్థలోని కండరాలను సడలించడానికి సహాయపడతాయని, భోజనం తర్వాత అసౌకర్యాన్ని తగ్గిస్తుందని తెలిపారు.

బరువు
బరువు తగ్గాలని అనుకునే వారికి యాలకుల టీ తాగడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే టీలో యాలకులు జోడించడం వల్ల మెటబాలిజం రేటు పెరుగుతుందని, తద్వారా కేలరీల ఖర్చు పెరిగి బరువు అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా యాలకుల టీ వల్ల శరీరం నుంచి అదనపు నీటిని తొలగించడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు.

డిటాక్సిఫైయర్
యాలకులు కాలేయం, మూత్రపిండాలు పనితీరుకు మద్దతు ఇచ్చే సమ్మేళనాలను కలిగి ఉంటాయని..క్రమం తప్పకుండా యాలకుల టీ తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన విషపదార్థాలను తొలగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

 

ఒత్తిడి
టీలో యాలకులను జోడించడం వల్ల శరీరానికి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుందంటున్నారు. యాలకుల నుంచి వచ్చే సువాసన ఒత్తిడి తగ్గించి ప్రశాంతతను కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన, ఒత్తిడి దూరమవుతుందని వివరించారు.

Also read: Cool Water Bath: ప్రతిరోజు చన్నీళ్లతో స్నానం చేస్తున్నారా..?

గుండె ఆరోగ్యం
యాలకుల్లోని ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెకు రక్త ప్రసరణ మెరుగుపరుస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పోషకాలు చెడు కొలెస్ట్రాల్ కరిగించి రక్తపోటును అదుపులో ఉంచుతాయని, హైబీపీతో బాధపడేవారు క్రమం తప్పకుండా తాగడం మంచిదని వివరించారు.

శ్వాసకోశ ఆరోగ్యం
యాలకుల టీ నేచురల్ డీకాంజెస్టెంట్​గా పనిచేస్తుందని, దీంతో దగ్గు, ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి శ్వాస సంబంధ సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చుని నిపుణులు పేర్కొన్నారు. అంతేకాకుండా టీ లో యాలకులు జోడించడం వల్ల మూసుకుపోయిన వాయుమార్గాలను క్లియర్ చేయడంలో, గొంతు నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుందంటున్నారు.

షుగర్ లెవెల్స్
టీలో యాలకులు జోడించడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచి డయాబెటిస్ ముప్పు తగ్గిస్తుందని చెబుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad