Tuesday, September 17, 2024
Homeఇంటర్నేషనల్KFC: ఫ్రైడ్ చికెన్ అగరబత్తీలు..KFC అరాచకాలంటే ఇవే

KFC: ఫ్రైడ్ చికెన్ అగరబత్తీలు..KFC అరాచకాలంటే ఇవే

మనందరికి అగర్బత్తీలంటే ఎంత పవిత్రమైన పూజా సామగ్రో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ పవిత్రమైన వాటన్నింటినీ అపవిత్రం చేయటం అనేది పశ్చిమదేశాలు పనిగా పెట్టుకున్నాయి. హిందూ సెంటిమెంట్లంటే ఏమాత్రం గౌరవం లేని విదేశీ కంపెనీలు యథేచ్ఛగా మన సెంటిమెంట్లపై దాడి చేసేస్తూనే ఉన్నాయి. తాజాగా ఇదే పని చేసింది కేఎఫ్ సీ. ఏకంగా చికెన్ ఫ్రై వాసన ఉన్న అగరొత్తులను లాంచ్ చేసింది. థాయ్ లాండ్ లో ఈమేరకు కేఎఫ్సీ లాంచ్ చేసిన ఫ్రైడ్ చికెన్ ఇన్సెన్స్ స్టిక్స్ వివాదానికి దారితీయగా ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలన్నీ కంపెనీ డిలీట్ చేసింది. చైనీస్ న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా ఇలాంటి రేర్ అగరొత్తులను లాంచ్ చేయాలని భారీ కసరత్తు చేసింది కేఎఫ్సీ. పైగా ఇందులో 11 రకాల హెర్బ్స్, సుగంధ ద్రవ్యాలు వంటివన్నీ వేసి ఊదబత్తిలు తయారు చేశామని గొప్పలు చెప్పుకుని నానారచ్చ చేసింది కేఎఫ్సీ.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News