Sunday, November 16, 2025
Homeఇంటర్నేషనల్Mexico Gen Z Protests: మెక్సికోలో తీవ్రమైన జెన్‌ జెడ్‌ నిరసనలు.. అధ్యక్ష భవనం వైపు...

Mexico Gen Z Protests: మెక్సికోలో తీవ్రమైన జెన్‌ జెడ్‌ నిరసనలు.. అధ్యక్ష భవనం వైపు దూసుకెళ్లిన యువత..!

Mexico Gen Z Protests Violence Erupts National Palace: నేపాల్‌ ప్రభుత్వాన్ని గడగడలాడించిన జెన్‌ జెడ్‌ ఉద్యమం ఇప్పుడు క్రమంగా ఇతర దేశాలకూ విస్తరిస్తోంది. తాజాగా జెన్‌ జెడ్‌ ఉద్యమం మెక్సికో దేశానికీ పాకింది. మెక్సికో ప్రభుత్వంపై జన్‌ జెడ్ తిరుగుబాటుకు సిద్ధమవుతోంది. దేశంలో పెరుగుతున్న నేరాలు, విపరీతమైన అవినీతి, నిరుద్యోగంపై జెన్‌ జెడ్‌ నిరసనలకు పిలుపునిచ్చింది. మెక్సికో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడి జెన్‌ జెడ్‌ యువత ప్రదర్శనలతో హోరెత్తిస్తోంది. తాజాగా జరిగిన ప్రదర్శనలో వేలాది మంది పాల్గొన్నారు. శనివారం దేశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేలాది మంది యువకులు నిరసన తెలిపారు. ఈ నిరసన మార్చ్‌లో అన్ని వయసుల వారు పాల్గొనడం విశేషం. వీరిలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన వృద్ధ కార్యకర్తలు కూడా ఉన్నారు. ఇటీవల హత్యకు గురైన మిచోకాన్ మేయర్ కార్లోస్ మాంజో మరణంపై దేశంలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. తాజా నిరసనలో మాంజో మద్దతుదారులు కూడా పాల్గొన్నారు.

- Advertisement -

మెక్సికోలో వెల్లువెత్తిన నిరసనలు..

మీడియా నివేదికల ప్రకారం.. అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ నివసించే మెక్సికో నగరంలోని నేషనల్ ప్యాలెస్ చుట్టూ నిరసనకారులు ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలతో హోరెత్తిస్తున్నారు. బారికేడ్లను సైతం దాటుకొని నేషనల్‌ ప్యాలెస్‌ వైపు దూసుకెళ్లడంతో నిరసనకారులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. నిరసనకారుల సమూహం దాడిలో 100 మంది పోలీసు అధికారులు గాయపడ్డారని, వారిలో 40 మంది ఆసుపత్రి పాలయ్యారని మెక్సికో నగర ప్రజా భద్రతా కార్యదర్శి పాబ్లో వాజ్క్వెజ్ ఒక విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసుల దాడిలో 20 మంది పౌరులు కూడా గాయపడ్డారని చెప్పారు. అలాగే ఈ నిరసనలకు సంబంధించి 20 మందిని అరెస్టు చేశారని, మరో 20 మందిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారతు.

నిరసనలకు కారణం ఇదేనా?

అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ మాదకద్రవ్యాల ముఠాలతో కుమ్మక్కయ్యారని జెన్-జి యువత ఆరోపిస్తోంది. క్లాడియా షీన్‌బామ్ అమెరికా విధానాలకు వ్యతిరేకంగా పలు చర్యలు తీసుకున్నారు. అంతేకాదు, వెనిజులాకు మద్దతు తెలిపారు. అధ్యక్షుడు ట్రంప్‌పై బహిరంగ విమర్శలతో ఆమె పాపులర్‌ అయ్యారు. అయితే, ఇప్పుడు జెన్-జి భారీ నిరసనలు అధ్యక్షురాలు క్లాడియా ప్రభుత్వాన్ని ప్రమాదంలో పడేస్తున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న షీన్‌బామ్ ప్రారంభంలో మంచి పాలనతో 70 శాతానికి పైగా ప్రజాదరణను పొందారు. అయితే, నవంబర్ 1న తన నగరంలో మాదకద్రవ్యాల ముఠాలకు వ్యతిరేకంగా ప్రచారానికి నాయకత్వం వహిస్తూ మరణించిన ఉరుపాన్ మేయర్ కార్లోస్ మాంజోతో సహా అనేక హత్యలపై ఆమె భద్రతా విధానాలు విమర్శలకు దారితీశాయి. తాజాగా, ఈ ఘటనపై మెక్సికన్ వార్తా సంస్థ ఎల్ యూనివర్సల్ నివేదిక పలు కీలక అంశాలను వెల్లడించింది. నిరసనకారులు నేషనల్ ప్యాలెస్ కాంప్లెక్స్‌లోకి ప్రవేశిస్తుండగా భద్రతా దళాలు భాష్ప వాయువును ప్రయోగించి, రాళ్ళు విసిరాయని స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad