Avoid Eating Sweet Corn: స్వీట్ కార్న్ ఆరోగ్యానికి ఎంత ప్రయోజనకరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది తినడానికి ఎంతో రుచికరంగా ఉంటుంది. అందుకే దీని పిల్లల నుంచి పెద్దల వరకు తినడానికి ఇష్టపడుతారు. దీనిలో ఫైబర్, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను నిర్వహించడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి, శక్తి స్థాయిలను నిర్వహించడానికి సహాయపడతాయి. అయితే, స్వీట్ కార్న్ అందరికీ ఆరోగ్యకరమైనది కాదని మీకు తెలుసా? అవును, స్వీట్ కార్న్ కొన్ని ఆరోగ్య పరిస్థితులలో తీసుకోవడం అసలు మంచిది కాదు. ముఖ్యంగా మధుమేహం, ఊబకాయం లేదా మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారికి ఇది ప్రయోజనానికి బదులుగా, హానికరం కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో స్వీట్ కార్న్‌ను ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉంటె తినకూడదో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
డయాబెటిస్: షుగర్ ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి. ఎందుకంటే? స్వీట్ కార్న్‌లో అధిక మొత్తంలో సహజ చక్కెర ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతుంది. కావున డయాబెటిస్ ఉన్నవారికి స్వీట్ కార్న్ తినాలనిపిస్తే, దీని పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. అలాగే ఉప్పు లేదా నెయ్యి లేకుండా తినకడానికి ప్రయత్నించాలి.
also read:Heart: గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించే సూపర్ ఫుడ్స్..ఈరోజు నుంచే మీ డైట్‌లో చేర్చుకోండి!
బరువు తగ్గడం: ఇప్పటికే మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటే దీనిని తినడం నివారించాలి. స్వీట్ కార్న్‌లో కార్బోహైడ్రేట్లు, కేలరీలు రెండూ ఎక్కువగా ఉంటాయి. కావున, ఇది బరువును పెంచుతుంది. దీనిని అధిక పరిమాణంలో తినడం వల్ల కొవ్వు నిల్వకు దారితీస్తుంది. బరువు తగ్గడం నెమ్మదిస్తుంది.
గ్యాస్ లేదా ఉబ్బరం: మొక్కజొన్నలోని ఫైబర్, స్టార్చ్ ఉంటుంది. ఇది జీర్ణం కావడానికి కష్టంగా ఉంటుంది. ఇప్పటికే గ్యాస్, ఉబ్బరం లేదా ఆమ్లత్వం ఉంటె స్వీట్ కార్న్ తినకపోవడమే మంచిది.
కిడ్నీ సమస్యలు: మూత్రపిండ వ్యాధికి భాస్వరం, పొటాషియం తీసుకోవడం పరిమితం చేయడం చాలా అవసరం. స్వీట్ కార్న్‌లో రెండింటినీ గణనీయమైన మొత్తంలో కలిగి ఉంటుంది. ఇది మూత్రపిండాల ఒత్తిడిని పెంచుతుంది. కావున కిడ్నీ రోగులు వైద్యుడిని సంప్రదించకుండా స్వీట్ కార్న్ తినకూడదు.
గ్లూటెన్ సెన్సిటివిటీ లేదా అలెర్జీ: స్వీట్ కార్న్ గ్లూటెన్ రహితంగా ఉంటుంది. కానీ, చాలా మంది స్వీట్ కార్న్ తినడం వల్ల అలెర్జీ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఈ సమస్యలు ఉన్నప్పటికీ స్వీట్ కార్న్ తింటే చర్మ దద్దుర్లు, తలనొప్పి లేదా కడుపు నొప్పి వంటి సమస్యల తలెత్తవచ్చు.
నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.


