ఐశ్వర్యా రాయ్ అదరగొట్టిన నింబుడా నింబుడా నింబుడా పాట గుర్తుందికదా. ఈ సెన్సేషనల్ హిట్ నంబర్ కు లేటెస్ట్ గా పాకిస్థాన్ డ్యాన్సర్ చేసిన డ్యాన్స్ తెగ వైరల్ అయింది. అలవోకగా చాలా ఈజ్ తో ఈయన చేసిన డ్యాన్స్ చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.
- Advertisement -
పఠానీ కుర్తా పైజమా వేసుకుని ఎహసాన్ రాజా అనే లాహోర్ డ్యాన్సర్ ఇరగదీసిన స్టెప్స్ అందరితో వావ్ అనిపించుకుంటోంది. ఓ పెళ్లికి వెళ్లిన ఆయన అలవోకగా చేసిన ఈ డ్యాన్స్ వీడియో చూసినవారు వావ్ అనకుండా ఉండలేకపోతున్నారు.