Thursday, July 4, 2024
Homeనేషనల్Delhi: సుప్రీంకు మనీష్, సంక్షోభంలో కేజ్రీవాల్ సర్కారు

Delhi: సుప్రీంకు మనీష్, సంక్షోభంలో కేజ్రీవాల్ సర్కారు

సీబీఐ అరెస్టు చేసిన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సుప్రీంకోర్టులో న్యాయపోరాటం మొదలుపెట్టారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంలో ఏ1 గా ఉన్న మనీష్ సిసోడియా న్యాయపోరాటం మొదలుపెట్టారు. ఆయన చేతుల్లోనే ఢిల్లీ ఆర్థిక శాఖ కూడా ఉండటంతో ఢిల్లీ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టడంపై ఆయన అరెస్టు ప్రభావం చూపనుంది. ఇంకా బడ్జెట్ రూపొందే దశలో ఉండగా, దాన్ని ఢిల్లీ అసెంబ్లీలోనూ ప్రవేశపెట్టాలి. మార్చి రెండవ వారం బడ్జెట్ ప్రవేశపెట్టడంపై ఇప్పుడు మబ్బులు ముసురుకున్నట్టైంది. ఏప్రిల్ 1వ తేదీనుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం అవుతుంది, ఈలోగా బడ్జెట్ ఎప్పుడైనా ప్రవేశ పెట్టచ్చు. కానీ ఆయన అరెస్టుతో ఢిల్లీ వార్షిక బడ్జెట్ ఏమవుతుందోననే ఆసక్తి నెలకొంది. గెహ్లాట్ తో బడ్జెట్ ను ప్రవేశ పెట్టించే పనుల్లో ఆప్ ఉన్నట్టు తెలుస్తోంది. కాగా మనీష్ ను అరెస్టు చేయడంతో యావత్ ప్రతిపక్ష పార్టీల్లో ఐక్యత పెరిగింది.

- Advertisement -

ప్రస్తుతం 5 రోజుల సీబీఐ కస్టడీలో ఆయన ఉన్నారు. ఐతే మనీష్ సిసోడియా ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారులో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన డిప్యుటీ సీఎం పదవితో పాటు 18 శాఖలను చూస్తున్నారు. మొత్తం 33 శాఖల్లో 18 శాఖలు ఆయన చేతుల్లోనే ఉండగా వాటిలో కీలకమైన ఆర్థిక, హోం, విద్యా శాఖలను కూడా మనీషే చూస్తున్నారు.

ఇప్పటికే ఆప్ మంత్రి సత్యేంద్ర జైన్ జైల్లో ఉన్నారు, తాజాగా ఈ లిస్టులో మనీష్ చేరుతారనే ప్రచారం ఊపందుకుంది. దీంతో ఆప్ సర్కారు సంక్షోభంలో పడిందని రాజకీయ పండితులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News