Sunday, June 30, 2024
Homeనేషనల్Jail life: రోజూ డ్రై ఫ్రూట్స్, సలాడ్స్, ఫిష్ కావాలి, జైల్లో పొలిటికల్ సెలబ్రిటీస్ డిమాండ్స్

Jail life: రోజూ డ్రై ఫ్రూట్స్, సలాడ్స్, ఫిష్ కావాలి, జైల్లో పొలిటికల్ సెలబ్రిటీస్ డిమాండ్స్

- Advertisement -

Jail life: వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న పొలిటికల్ సెలబ్రిటీలు తమకు జైల్లో కూడా సకల రాజమర్యాదలు కావాలని డిమాండ్ చేస్తుంటారు. జైలు అధికారులను ఎలాగోలా దారి తెచ్చుకుని దర్జాగా సెల్లులోనే లావిష్ గా బతికేస్తుండటం మనం తరచూ చూస్తున్నాం. తాజాగా వీటికోసం కోర్టుకెక్కుతున్నారు కొందరు పాపులర్ పొలిటీషియన్స్. వేల కోట్ల రూపాయల కుంభకోణంలో చిక్కుకుని ప్రస్తుతం జైల్లో ఉన్న వెస్ట్ బెంగాల్ మాజీ మంత్రి పార్థా ఛటర్జీ ఇప్పటికే డ్రమ్ములకొద్దీ నీళ్లతో రోజూ గంటలతరబడి స్నానం చేస్తున్నారు. పైగా స్నానం చేసేప్పుడు నీళ్లు తోడిచ్చేందుకు తనకో అసిస్టెంట్ కావాలని, మొబైల్ ఫోన్ కూడా కావాలని ఆఫీసర్స్ ను డిమాండ్ చేశారు. ఇంతటితో ఈయన విష్ లిస్ట్ పూర్తి కాలేదు.. ప్రతిపూటా తనకు 4 పీసుల ఫిష్, 6 పీసుల మీట్ కావాలని ఆయన డిమాండ్ చేస్తున్నారట. ఇవన్నీ కాకుండా 24 గంటలూ గార్డు తన సెల్ వద్ద ఉండకూడదని ఒకటే డిమాండ్స్ చేస్తున్నారు. తాను ఓ వీఐపీ మినిస్టర్నని ఆయన పదేపదే జైలు అధికారులను బెదిరిస్తున్నారు.

ఇటు ఓ రేపిస్టుతో మసాజ్ చేయించుకుంటున్న మరో మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ తనకు డ్రై ఫ్రూట్స్, సలాడ్స్ రోజూ కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మాజీ ఢిల్లీ మంత్రి తిహార్ జైలు అధికారులకు రోజూ చుక్కలు చూపించేస్తున్నారు. మనీలాండరింగ్ కేసుల్లో ఈయనపై విచారణ సాగుతుండగా ప్రస్తుతం సత్యేంద్ర తిహార్ జైల్లో ఉన్నారు. మిక్డ్స్ సీడ్స్, పళ్లు, ఖర్జూరాలు, డ్రై ఫ్రూట్స్, సలాడ్స్ ఏవీ తనకు అధికారులు ఇవ్వటం లేదని లేటెస్ట్ గా జైన్ కంప్లైంట్ చేస్తున్నారు. అంతేకాదు ఆయన ఈ విషయంపై ఏకంగా కోర్టుకెక్కారు కూడా. తన కులాచారం ప్రకారం సెంటిమెంటల్ గా ఆయన గత 6 నెలలుగా ఉపవాసం ఉంటూ ఇలాంటివి మాత్రమే తింటున్నట్టు ప్రస్తుతం జైలు అధికారులు ఇవి తనకు సప్లై చేయకపోతే ఎలా అంటూ ఆయన న్యాయపోరాటానికి దిగటం హైలైట్. ఏమైనా పొలిటికల్ సెలబ్రిటీల జైల్ లైఫ్ లో ఇలాంటి సెన్సేషన్స్ లేకుండా ఎలా జైల్ డైరీ పూర్తవుతుందని కామన్ మ్యాన్ అనుకుంటున్నాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News