Fire Accident in Restaurant Gorakhpur: ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్‌లోని ఓ రెస్టారెంట్‌లో ఆదివారం ఉదయం ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఫౌజ్ మ్యూజియం ఎదురుగా అదర్వవేద రెస్టారెంట్ అండ్ బాంక్వెట్ హాల్‌లో అకస్మాత్తుగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలు ఆర్పేశారు.
నాలుగు ఫైరింజన్‌ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. అనంతరం భవనాన్ని పరిశీలించగా.. మొదటి ఫ్లోర్‌లో వాష్‌రూమ్‌లో వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్ని ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
#WATCH | Gorakhpur, UP: Fire breaks out at a restaurant and banquet hall in Gorakhpur early this morning. Fire tenders reached the spot and doused the flames. pic.twitter.com/zkfckNQXxU
— ANI (@ANI) November 16, 2025


