Saturday, October 5, 2024
Homeనేషనల్IMD: జీరో విజిబిలిటీ, కళ్లు పొడుచుకున్నా పంజాబ్ లో ఏమీ కనిపించట్లే

IMD: జీరో విజిబిలిటీ, కళ్లు పొడుచుకున్నా పంజాబ్ లో ఏమీ కనిపించట్లే

ఉత్తరాదిని విపరీతమైన పొగ మంచు వణికిస్తోంది. ఎముకలు కొరికే చలిలో నార్త్ ఇండియన్ స్టేట్స్ గజగజలాడుతున్నాయి. ఇటు పంజాబ్ భటిండాలో అయితే మరీ దారుణంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. కళ్లు పొడుచుకున్నా ఏమీ కనిపించనంత దట్టమైన పొగ మంచు వ్యాపించటంతో జీరో విజిబిలిటీ పరిస్థితులు నెలకొన్నాయి.

- Advertisement -

ఇటు రాజధాని న్యూ ఢిల్లీలోనూ చలి తీవ్రత అధికంగా ఉంది. విజిబిలిటీ లేని కారణంగా వరుసగా 5వ రోజు కూడా విమానం, రైళ్ల రాకపోకల్లో ఆలస్యం జరుగుతోంది. ఈరోజు 118 డొమెస్టిక్ ఫ్లైట్ సర్వీసులను రీషెడ్యూల్ చేయక తప్పని పరిస్థితి నెలకొంది. ఢిల్లీలో 200 మీటర్ల మేరకు మాత్రమే విజిబిలిటీ ఉండటంతో ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో ‘ఫాగ్ అలర్ట్; ప్రకటించారు. ఢిల్లీలో చాలా చోట్ల 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ శాఖ చెబుతోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో మరో రెండు రోజులపాటు వాతావరణం ఇలాగే కొనసాగుతుందని ఐఎండీ హెచ్చరించిది. ఢిల్లీలో నిన్న అత్యల్పంగా 1.9 డిగ్రీల సెల్సియస్ నమోదవ్వటం విశేషం. దీంతో ఈనెల 15 వరకు స్కూళ్లను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News