భారతీయ రైల్వే(Indian Railways) మే 1 నుంచి కొత్త రూల్ ప్రకటించింది. కొత్త నిబంధన ప్రకారం వెయిటింగ్ లిస్ట్ టికెట్లతో స్లీపర్ లేదా ఏసీ కోచ్‌లలో ప్రయాణించడంపై ఆంక్షలు విధించనుంది. కన్ఫర్మ్ టికెట్లు ఉన్న ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుని రైల్వే శాఖ స్పష్టం చేసింది.
వెయిటింగ్ టికెట్ కలిగిన ప్రయాణికులు కేవలం జనరల్ బోగీల్లో మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా వెయిటింగ్ టికెట్‌తో స్లీపర్ లేదా ఏసీ కోచ్‌లలో ప్రయాణిస్తే చర్యలు తప్పువు. చాలా సందర్భాల్లో వెయిటింగ్ టికెట్లు ఉన్న ప్రయాణికులు స్లీపర్, ఏసీ కోచ్‌లలోకి ప్రవేశించి కన్ఫర్మ్ టికెట్లు ఉన్న వారి సీట్లలో కూర్చోవడంతో వారికి తీవ్ర అసౌకర్యం కలుగుతోందని రైల్వేశాఖ గుర్తించింది.
వెయిటింగ్ టికెట్‌తో స్లీపర్ కోచ్‌లో ప్రయాణిస్తూ పట్టుబడితే రూ. 250 జరిమానాతో పాటు ప్రయాణానికి పూర్తి ఛార్జీని వసూలు చేసే అవకాశం ఉంది. ప్రయాణించే దూరాన్ని బట్టి అదనపు ఛార్జీలు కూడా విధించవచ్చు. అలాగే థర్డ్ ఏసీ లేదా సెకండ్ ఏసీ కోచ్‌లలో ప్రయాణిస్తే ప్రయాణ ఛార్జీకి అదనంగా సుమారు రూ. 440 వరకు జరిమానా చెల్లించాలి. అంతేకాకుండా నిబంధనలు ఉల్లంఘించిన ప్రయాణికుడిని జనరల్ కోచ్‌లోకి లేదా తదుపరి స్టేషన్‌లో రైలు నుంచి దించివేసే అధికారం టీటీఈకి ఉంటుంది.