Baggage handlers carelessly : లగేజీ రాలేదని, లగేజీకి డ్యామేజ్ జరిగిందని కొన్ని సార్లు విమాన ప్రయాణీకులు ఆరోపిస్తుండడం చూస్తూనే ఉంటాం. ఇటీవల ఇండిగో ఎయిర్ లైన్ సిబ్బంది పార్క్ చేసిన ట్రైలర్‌లోకి విమానం నుంచి దించుతున్న లగేజీ /బ్యాగేజీ ని నిర్లక్ష్యంగా విసురుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
దీన్ని ఓ వ్యక్తి సెల్‌ఫోన్‌లో వీడియో తీశారు. triptoes అనే ట్విట్టర్ యూజర్ దీన్ని పోస్ట్ చేస్తూ.. “హాయ్ ఇండిగో, మీరు ప్రతి రోజూ విమానంలోని అన్ని సామానులను ఈ విధంగానే నిర్వహిస్తారా..? లేదా ఈ రోజే ప్రత్యేకంగా ఇలా చేశారా..? ” అని రాసుకొచ్చాడు. క్షణాల్లో ఈ వీడియో వైరల్‌గా మారింది. దీనిపై నెటీజన్లు మండిపడ్డారు. పలువురు నెటీజన్లు తమకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు.
దీనిపై ఇండిగో సంస్థ స్పందించింది. “మిస్ గోయెల్, మీ ఫీడ్ బ్యాక్‌కు ధన్యవాదాలు. షేర్ చేసిన వీడియోలోని బాక్స్‌లు ప్రయాణీకుల సంబంధించిన లగేజీ కాదు. ఇవి వేగంగా కదిలే, తక్కువ బరువు ఉన్న కంటైనర్‌లు. వేగంగా తరలించేందుకు పగలని విధంగా సిబ్బంది వీటిని ప్యాక్ చేస్తారు” అని తెలిపింది.