Monday, June 23, 2025
Homeనేషనల్Caste Descrimination:ఇండిగో ట్రైనీ పైలట్‌పై కులం పేరుతో దూషణ.. సీనియర్ అధికారులపై కేసు నమోదు

Caste Descrimination:ఇండిగో ట్రైనీ పైలట్‌పై కులం పేరుతో దూషణ.. సీనియర్ అధికారులపై కేసు నమోదు

Caste Discrimination to Indigo Pilot: ఇండిగోకు చెందిన 35 ఏళ్ల ట్రైనీ పైలట్‌పై ముగ్గురు సీనియర్ అధికారులు అసభ్య పదజాలంతో కుల వివక్షకు గురిచేశారని సదరు పైలట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అట్రాసిటీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. ఈ ఎఫ్‌ఐఆర్‌లో తపస్ డే, మనీష్ సాహ్ని, కెప్టెన్ రాహుల్ పాటిల్ పేర్లు ఉన్నాయి.

షెడ్యూల్డ్ కులానికి చెందిన ట్రైనీ పైలట్‌ ఏప్రిల్ 28న గురుగ్రామ్‌లోని ఇండిగో ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో అధికారులు తనను కులం పేరుతో ఘోరంగా అవమానించారని ఆరోపించారు. తనను విమానం నడపడానికి సరిపోవని వెనక్కి వెళ్లి చెప్పులు కుట్టుకో అని హేళన చేసినట్లు ఫిర్యాదు దారుడు చెప్పాడు. ఇక్కడ కనీసం వాచ్‌మెన్‌గా ఉండటానికి కూడా మీకు అర్హత లేదని అధికారులు తనతో అన్నారని పైలట్ వాపోయాడు.

అయితే ఈ ఆరోపణలను ఇండిగో ఖండించింది. వివక్ష, వేధింపులు పట్ల ఎటువంటి పక్షపాతం ధోరణి ఉండదని స్పష్టం చేసింది. ఇదే సమయంలో జీరో టాలరెన్స్ విధానాన్ని కొనసాగిస్తుందని.. అందరికీ గౌరవప్రదమైన పని ప్రదేశంగా ఇండిగో పనిచేస్తుందని ఓ ప్రకటనలో తెలిపింది. ఇటువంటి నిరాధారమైన వాదనలను ఇండిగో తీవ్రంగా ఖండిస్తుందని.. నిష్పాక్షికత, సమగ్రత, జవాబుదారీతనం వంటి విలువలకు కట్టుబడి ఉందని పేర్కొంది. ఇందుకోసం అవసరమైన మద్దతు ఇస్తుందని ఒక ప్రతినిధి సైతం మీడియాకు తెలిపారు.

బెంగళూరుకు చెందిన ట్రైనీ పైలట్ తొలుత అక్కడి పోలీసులను ఈ విషయమై ఆశ్రయించారు. దీంతో పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ కింద నమోదు చేసి ఘటన జరిగిన గురుగ్రామ్‌కు కేసుని బదిలీ చేశారు.

ఎయిర్‌లైన్స్ ఏమార్‌ క్యాపిటల్ టవర్ 2వ కార్యాలయానికి వచ్చిన మరుక్షణమే వేధింపులు మొదలయ్యాయని సదరు ఫిర్యాదుదారుడు ఆరోపించారు. తపస్ డే తన ఫోన్, బ్యాగ్‌ను అవమానకరంగా బయటే వదిలేయాలని ఆదేశించడాన్ని అతను ప్రస్తావించాడు. అతని బాధపెట్టే మాటలే ఆ తర్వాత జరిగిన పరిణామాలకు దారితీశాయని పైలట్ తన కంప్లైంట్‌లో వివరించాడు.

ఈ వేధింపులు కేవలం మాటలకే పరిమితం కాలేదని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అకారణంగా జీతాల్లో కోతలు, బలవంతపు ట్రైనింగ్‌, ప్రయాణ సౌకర్యాలను రద్దు చేయడతో మరెన్నో అనవసరమైన హెచ్చరిక లెటర్స్‌తో “వృత్తిపరంగా చాలా విధాలా  వేధించినట్లు అతను వాపోయాడు. పై అధికారులు చేసిన వ్యాఖ్యలు అవమానకరంగా ఉండటమే కాకుండా.. షెడ్యూల్డ్ కులం వ్యక్తిగా తన గుర్తింపును, హోదాను కించపరిచేలా చేశాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని సీనియర్ మేనేజ్‌మెంట్, ఇండిగో ఎథిక్స్ కమిటీ దృష్టికి తీసుకెళ్లినా వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపాడు. దీనిపై కూడా ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News