బిహార్ శాసనమండలి సమావేశం హాట్ హాట్‌గా కొనసాగింది. సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar), మాజీ సీఎం రబ్రీ దేవి (Rabri Devi) మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకొంది. ప్రశ్నోత్తరాల సమయంలో ఆర్జేడీ మిత్రపక్షమైన సీపీఐ(ML) సభ్యుడు శశి యాదవ్ అడిగిన ఓ ప్రశ్నకు ప్రభుత్వం నుంచి సమాధానం వచ్చింది. అయితే ప్రభుత్వం ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదంటూ రబ్రీ దేవి తెలిపారు.
వెంటనే సీఎం నీతీశ్ కుమార్ కలుగజేసుకుని తమ ప్రభుత్వం రాష్ట్రం కోసం ఎంతో చేసిందని.. గత ప్రభుత్వం ఎలాంటి మేలు చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో మహిళలకు ఇప్పుడున్నంత గౌరవం గత ప్రభుత్వాల హయాంలో లేదని ఆరోపించారు. భర్త లాలూ ప్రసాద్ యాదవ్ సమస్యల్లో ఉన్నప్పుడు ఆమెను సీఎం కుర్చీలో కూర్చోబెట్టారని వ్యాఖ్యానించారు. దీంతో నితీశ్ వ్యాఖ్యలపై రబ్రీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ హయాంలో ఎలాంటి మంచి పనులు జరగలేదని నితీశ్ వ్యాఖ్యానించడం దారుణమని ఫైర్ అయ్యారు. అనంతరం విపక్ష సభ్యులతో కలిసి సభ నుంచి రబ్రీ దేవి వాకౌట్ చేశారు.