జమ్ము కశ్మీర్ లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న మంచు ధాటికి జనజీవనం స్థంభించిపోయింది. దీంతో వైద్యులు కూడా ఆసుపత్రికి వెళ్లి విధులు హాజరయ్యే పరిస్థితులు లేవు. ఈనేపథ్యంలో అత్యవసరంగా కాన్పులు చేయాల్సి వచ్చినప్పుడల్లా వీళ్లు వాట్సాప్ యాప్ ను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. కేరన్ లో ఓ నిండు గర్భిణీకి ఇలా వాట్సప్ కాల్ తో స్థానిక వైద్యులు పురుడు పోయగా.. పండంటి బిడ్డకు ఆమె జన్మనిచ్చింది. తల్లీ-బిడ్డా ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. గురువారం నుంచి కురుస్తున్న మంచుకు కశ్మీరీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.