Tuesday, September 17, 2024
Homeనేరాలు-ఘోరాలుRajasthan : ఊహించని కాల్పులు.. 48 గంటలు ఇంటర్నెట్ బంద్

Rajasthan : ఊహించని కాల్పులు.. 48 గంటలు ఇంటర్నెట్ బంద్

ఊహించని కాల్పులతో రాజస్థాన్ ఉలిక్కిపడింది. ఆ రాష్ట్రంలోని బిల్వారాలో గుర్తు తెలియని దుండగులు ఇద్దరు ముస్లిం సోదరులపై కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర బుల్లెట్ గాయాలు కావడంతో.. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందడంతో.. కుటుంబీకులు ఆస్పత్రిని ధ్వంసం చేశారు. గాయాలపాలైన మరో వ్యక్తిని ఉదయ్‌పూర్ ఆస్పత్రికి తరలించారు. గతంలో ఆదర్శ తపాడియా అనే వ్యక్తి హత్యకు ప్రతీకారంగానే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.

- Advertisement -

నలుగురు వ్యక్తులు బైక్ పై వచ్చి కాల్పులు జరిపి పరారయ్యారు. కాగా.. మరణించిన వ్యక్తి ముస్లిం కావడంతో.. ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరిగే అవకాశం ఉండటంతో.. పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా బిల్వారా పరిధిలో 48 గంటలపాటు ఇంటర్నెట్ ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది మేలో తపాడియాను కొందరు వ్యక్తులు హత్య చేశారు. అప్పట్లో ఆందోళనకర పరిస్థితులు తలెత్తగా.. మళ్లీ అలాంటి పరిస్థితులు రాకుండా పోలీసులు జాగ్రత్త వహిస్తున్నారు. బిల్వారా ప్రాంతమంతా పోలీసుల పహారాలో ఉంది. కాల్పులు జరిపి పరారైన వారికోసం జల్లెడ పడుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News