ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ మోడీ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. 99 ఏళ్ల హీరాబెన్ ఆరోగ్యం రాత్రి నుంచి విషమంగా మారటంతో ఆమెను అహ్మాదాబాద్ లోని ఆసుపత్రికి తరలించారు. సిటీలోని యుఎన్ మెహతా ఆసుపత్రిలో ఆమె ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. మంగళవారం నాడు ప్రధాని సోదరుడు ప్రహ్లాద్ మోడీ, ఆయన కుటుంబసభ్యులు మైసూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయాలపాలయ్యారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో చివరిసారిగా మోడీ తన తల్లిని గాంధీనగర్ లోని స్వగృహంలో కలిశారు. జూన్ 18వ తేదీన ఆమె 100వ పుట్టినరోజు జరుపుకున్నారు కూడా. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు ప్రకటించారు.
Modi mother: ఆసుపత్రిలో మోడీ తల్లి, నిలకడగా ఆరోగ్యం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES