పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను అదానీ అంశం కుదిపేస్తోంది. అదానికి కేంద్రం అండదండలున్నాయని, అసలు అదానీ చేస్తున్న మోసాలపై సభలో చర్చ జరపాలని, విచారణ కమిటీలు వేయాల్సిందేనంటూ ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. పార్లమెంట్ లో రెగ్యులర్ గా జరిగే చర్చలన్నింటినీ నిలిపేసి తక్షణం అదానీ కుంభకోణాలపై చర్చకు పట్టుబడుతున్నాయి విపక్ష పార్టీలు. అదానీ గ్రూప్ లో పెట్టుబడులు పెట్టిన వారి సంగతేంటంటూ ప్రతిపక్ష పార్టీలన్నీ ధ్వజమెత్తుతున్నాయి. అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ ఇచ్చిన అదానీ నివేదిక కళ్లు బైర్లు కమ్మేలా చేస్తోందంటూ కాంగ్రెస్, ఆప్ వంటి పార్టీలన్నీ గట్టిగా పట్టుబడుతున్నాయి.