Friday, November 22, 2024
Homeనేషనల్ఆఖరి నిమిషంలో పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు.. ఆమె చెప్పిన కారణానికి విస్తుపోయిన వరుడు

ఆఖరి నిమిషంలో పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు.. ఆమె చెప్పిన కారణానికి విస్తుపోయిన వరుడు

రకరకాల కారణాలతో ఆఖరి నిమిషంలో క్యాన్సిల్ అయిన పెళ్లిళ్లెన్నో ఉన్నాయి. వరుడు నల్లగా ఉన్నాడని, వధువు బాలేదని, పొట్టిగా ఉన్నాడని, కట్నం ఇవ్వలేదని, ప్రేమ వ్యవహారాలు, మర్యాదలు సరిగా చేయలేదని.. ఇలా అనేక కారణాలతో పెళ్లిళ్లు రద్దైన ఘటనలు కోకొల్లలు. కానీ.. ఓ వధువు.. అంతకుమించి అన్నట్టుగా.. చాలా చిన్న సిల్లీ రీజన్ తో పెళ్లిని క్యాన్సిల్ చేసింది. ఆమె చెప్పిన కారణం విని వరుడే కాదు.. పెళ్లికొచ్చిన అతిథులూ విస్తుపోయారు. ఇప్పుడీ వార్త నెట్టింట్లో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు సైతం విషయం తెలిసి షాకవుతున్నారు.

- Advertisement -

ఇంతకీ ఆ పెళ్లికూతురు చెప్పిన కారణమేంటో తెలుసా ? వరుడి ముక్కు చిన్నగా ఉందట..అందుకని పెళ్లి రద్దు చేసేసింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్ లోని సంభాల్ జిల్లాలో చోటుచేసుకుంది. వరుడి కుటుంబం ఊరేగింపుగా వధువు ఇంటికొచ్చింది. అప్పటికే అక్కడున్న జనంలో కొందరి దృష్టి పెళ్లికొడుకుపై చేరింది. అతని ముక్కేంటి అంత చిన్నగా ఉందని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఆ నోటా..ఈ నోటా ఆ మాట కాస్తా పెళ్లికూతురి చెవిన పడింది. అంతే.. నాకీ పెళ్లి వద్దు, క్యాన్సిల్ అనేసింది. దీంతో అంతా షాక్ అయ్యారు. పెళ్లి కొడుకు ఫ్యామిలీ నివ్వెరపోయింది. ఎందుకమ్మా పెళ్లి వద్దన్నావు అంటే.. వరుడి ముక్కు చిన్నగా ఉంది.. నాకు నచ్చలేదు అని చెప్పడంతో పెళ్లి కొడుకు, అతడి కుటుంబసభ్యులకు దిమ్మ తిరిగిపోయింది.

అందరూ కలిసి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా.. వినిపించుకోలేదు. పెళ్లి వద్దంటే..వద్దు అని తేల్చి చెప్పేసింది. దీంతో వరుడి కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కూడా ఏమీ చేయలేక చేతులెత్తేశారు. ఇక చేసేది లేక వరుడి కుటుంబం అక్కడి నుండి వెనుదిరిగింది. పెళ్లికూతురు చెప్పిన కారణం.. ఆమె వైఖరి మరీ కామెడీగా ఉందంటున్నారు నెటిజన్లు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News