Italian Couple: ప్రపంచ దేశాలలో హిందూ సంప్రదాయానికి ఉండే విలువ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. హిందూ సంప్రదాయంలో పెళ్లి అంటే ఫారిన్ దేశాలలో కూడా స్పెషల్ క్రేజ్ ఉంటుంది. హిందూ సంప్రదాయం పెళ్లిలో ప్రతి ఘట్టం వెనుక ఒక సైటిఫికల్ కారణం ఉందని ఇప్పటికే రీసెర్చ్ చేసిన నిపుణులు చెప్తుండగా.. మరోవైపు ప్రపంచ దేశాలలో మన పెళ్లి తంతుకు ఆదరణ పెరుగుతుంది.
తాజాగా ఓ ఇటలీ జంట ఇండియాకొచ్చి హిందూ ఆచార సంప్రదాయాల ప్రకారం మనువాడారు. అది కూడా ప్రేమకి చిహ్నమైన తాజ్ మహల్ వద్ద ఈ పెళ్లి జరగడం విశేషం. అయితే.. వీళ్లేమీ ఇప్పుడే కొత్తగా పెళ్లి చేసుకోలేదు. వీళ్ళకి పెళ్ళై 40 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు చేసుకున్నది 40వ వార్షికోత్సవ పెళ్లి. ఇటలీ నుంచి వచ్చి న మౌరో, స్టెఫానియా దంపతులు.. తమ 40వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా హిందూ సంప్రదాయం ప్రకారం తాజ్ మహల్ ప్రాంతంలో పెళ్లి చేసుకోవాలని ఇండియాకి వచ్చారు.
తాజ్ మహల్ సమీపంలోని ఓ రిసార్ట్ లో సంప్రదాయబద్దంగా మళ్ళీ వివాహం చేసుకున్నారు. మౌరో, స్టెఫానియా సంప్రదాయ దుస్తుల్లో తాజ్ మహాల్ ను సందర్శించి.. వివాహం అనంతరం కొత్త జంట అందరితో కలిసి డ్యాన్సులు వేశారు. గత 5 ఏళ్లుగా ఇలా పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటే.. మొత్తానికి ఇప్పుడు ఇలా కల నెరవేరిందని ఇటాలియన్ జంట వివరించింది. భారతీయులు తమ మూలాలు మరిచిపోతుంటే.. విదేశీయులు మాత్రం పాటిస్తున్నారని ఈ పెళ్లి చేసిన పురోహితుడు ప్రవీణ్ దత్
అభిప్రాయపడ్డారు.