Thursday, June 19, 2025
HomeNewsActress Kajal: మెగాఫోన్ ప‌ట్ట‌నున్న చంద‌మామ‌

Actress Kajal: మెగాఫోన్ ప‌ట్ట‌నున్న చంద‌మామ‌

Kajal Aggarwal: ‘లక్ష్మీ కళ్యాణం’తో టాలీవుడ్ లో అడుగుపెట్టిన కాజల్ అగర్వాల్, ‘చందమామ’ సినిమా తర్వాత ఒక్కసారిగా అవకాశాల వర్షం వెల్లువెత్తింది. స్టార్ హీరోల సరసన నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన కాజల్, కెరీర్ టాప్‌లో ఉన్నప్పుడే చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లుతో పెళ్లి చేసుకుని, తల్లిగా మారి కొంతకాలం బ్రేక్ తీసుకుంది. ఇక కాజ‌ల్‌కి సినిమాలు ఏం వ‌స్తాయిలే అని అంద‌రూ అనుకున్నారు. కానీ ఈ ముద్దుగుమ్మ నెమ్మ‌దిగా అవ‌కాశాల‌ను అందిపుచ్చుకోవ‌టంలో స‌క్సెస్ అయ్యింది. అయితే ఇప్పుడు మళ్లీ తిరిగి ఫుల్ ఫామ్ లోకి రావాలని నిర్ణయించుకున్న కాజల్, వరుస సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. కానీ, ఈ రీ ఎంట్రీ తర్వాత మాత్రం అంతగా బ్లాస్టింగ్ బ్రేక్ దక్కలేదు. ‘భగవంత్ కేసరి’ విజయవంతమైనా ఆ క్రెడిట్ అంతా బాలయ్య, అనిల్ రావిపూడి ఖాతాలోకి వెళ్లింది. పెళ్లికి ముందు నటించిన సత్యభామ.. ఆమె పెళ్లి తర్వాత రిలీజైంది. ఆ సినిమాపై భారీ న‌మ్మ‌కాన్ని పెట్టుకుంది కాజ‌ల్‌. కానీ సినిమా డిజాస్ట‌ర్ అయ్యింది.

- Advertisement -

ఈ నేపథ్యంలో కాజల్ కెరీర్‌లో కొత్త మలుపు తిరగబోతున్నట్టు తెలుస్తోంది. కేవలం కథలు విని నటించడమే కాదు, డైరెక్షన్ రంగంలోకి అడుగుపెట్టేందుకు సీరియస్‌గా ప్లాన్ చేస్తోందట. తానే డైరెక్ట్ చేసి, తానే ప్రధాన పాత్రలో నటించే ఒక ప్రాజెక్ట్ ను సైలెంట్‌గా సిద్ధం చేస్తోందన్న వార్తలున్నాయి. ఇండస్ట్రీలో ఇప్పటికే ఈ టాక్ బలంగా వినిపిస్తోంది. ఇది ఒక బోల్డ్ రోల్ అవుతుందనే ప్రచారం కూడా ఊపందుకుంటోంది. ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా… తాను ఇన్నేళ్లు పరిశ్రమలో చేసిన అనుభవాన్ని ఇప్పుడు దర్శకురాలిగా వినియోగించాలన్న కాజల్ ఆలోచనలో ఉందట. త్వరలోనే ‘చందమామ’ డైరెక్టర్ అవతారంలో దర్శనమిస్తుందని టాక్.

ALSO READ: https://teluguprabha.net/news/clash-between-hari-hara-veera-mallu-and-kingdom/

అయితే, డైరెక్షన్ వైపు అడుగులు వేస్తూ, నటిగా మాత్రం వెనకడుగు వేయబోనని తెలుస్తోంది. ప్రస్తుతం కాజల్ మంచు విష్ణు నటిస్తున్న ‘కన్నప్ప’ చిత్రంలో పార్వతీ దేవిగా కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే కాకుండా, కమల్ హాసన్ హీరోగా వస్తున్న ఇండియన్ 3లో, అలాగే ప్రతిష్టాత్మక రామాయణం ప్రాజెక్ట్ లో శూర్పణక పాత్రలో కాజల్ అగర్వాల్ నటిస్తుంది. మొత్తానికి, నటిగా మళ్లీ బిజీగా మారుతూనే, దర్శకురాలిగా కొత్త ప్రయాణం మొదలెట్టేందుకు రెడీ అవుతున్న కాజల్ ఈసారి ప్రేక్షకుల్ని ఓ కొత్త కోణంలో ఆశ్చర్యపరచబోతోందని చెప్పొచ్చు!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News