Amit Shah On English : దిల్లీలో జరిగిన ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ IAS అధికారి అశుతోష్ అగ్నిహోత్రి రచించిన “మేన్ బూంద్ స్వయం ఖుద్ సాగర్ హూన్” అనే పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ ఆయన ప్రసంగించారు. భారతదేశంలో ఇంగ్లీష్ మాట్లాడటానికి ఇస్తున్న ప్రాధాన్యతను తప్పుబట్టారు. “ఇంగ్లీష్ మాట్లాడేవారు సిగ్గుపడే సమాజం రాబోతోంది. ఆ రోజు ఎంతో దూరంలో లేదు” అని ఆయన పేర్కొన్నారు. మాతృభాషల పట్ల మన ఆత్మగౌరవాన్ని తిరిగి పొందాల్సిన సమయం ఇదేనని ఆయన నొక్కి చెప్పారు.
ఇంగ్లీష్ మాట్లాడేవారు సిగ్గుపడే రోజు వస్తుంది : భారతదేశంలో ఆంగ్లానికి (ఇంగ్లీష్) విపరీతమైన ప్రాధాన్యత ఇస్తున్న ప్రస్తుత పరిస్థితిని తప్పుపడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కీలక వ్యాఖ్యలు చేశారు. “ఇంగ్లీష్ మాట్లాడేవారు సిగ్గుపడే సమాజం రాబోతుంది. ఆ రోజు ఎంతో దూరంలో లేదు” అని ఆయన పేర్కొన్నారు. మాతృభాషల పట్ల మన ఆత్మగౌరవాన్ని తిరిగి పొందాల్సిన సమయం ఇదేనని ఆయన నొక్కి చెప్పారు.
భాషలు లేకపోతే భారతీయతను కోల్పోతాం : మన భాషలు లేని భారతదేశాన్ని మనం ఊహించలేం” అని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. మాతృభాషలే మన గుర్తింపునకు ఆధారాలని, వాటి పట్ల గర్వం లేకపోతే మనం భారతీయులం అని చెప్పుకోవడానికి అర్హతే ఉండదని ఆయన పేర్కొన్నారు. విదేశీ భాషలపై అతిగా ఆధారపడే ధోరణిని ఆయన గట్టిగా వ్యతిరేకించారు.
2047 నాటికి భారత్ ప్రపంచ శక్తిగా ఎదుగుతుంది: కేంద్ర హోంమంత్రి మాట్లాడుతూ, “2047 నాటికి భారతదేశం ప్రపంచ శక్తిగా ఎదుగుతుంది” అని దృఢంగా విశ్వాసం వ్యక్తం చేశారు. ఆ దిశగా మన ప్రయాణంలో భాషల భద్రత, అభివృద్ధి కీలకమని ఆయన నొక్కి చెప్పారు. “భాషా గౌరవం = జాతీయ గౌరవం” అనే ముఖ్యమైన సందేశాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు ఇచ్చారు.
భాషలు మన సంస్కృతికి ఆభరణాలు :
“మన దేశంలోని అనేక భాషలే భారతీయ సంస్కృతికి శోభను చేకూర్చే ఆభరణాలుగా మారాయని కేంద్ర హోంమంత్రి పేర్కొన్నారు. వాటిని భద్రపరచడం మన కర్తవ్యం” అని స్పష్టం చేశారు. సగం నేర్చుకున్న విదేశీ భాషలతో సంపూర్ణ భారతీయతను నిర్మించలేమని కూడా ఆయన నొక్కి చెప్పారు.


